Nayanthara : నయనతార ఒడిలో ఉన్న చిన్నారి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే షాకే.. ఏం చేస్తుందంటే..
ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలాగే మరికొందరు చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయారు. అయితే అప్పట్లో నయనతార సినిమాలో కనిపించిన ఓ చిన్నారి లేటేస్ట్ లుక్స్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుందా.. ?

బాలనటీనటులుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన చాలా మంది తారలు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారారు. మరికొందరు ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి గుర్తుందా.. ? 2018లో నయనతార నటించిన ‘ఇమైక్క నోడిగల్’లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఈ మూవీలో అగ్రెసివ్ చిన్నారిగా తన నటనతో ఆకట్టుకుంది. ఆ అమ్మాయి పేరు మనస్వి కొట్టాచి. ఇందులో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోపం ఎక్కువగా వచ్చే అమ్మాయిగా నటించి అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా పోలీసు అధికారి నయనతారతో మాట్లాడే సందర్భంలో తన నటనతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. చంపేస్తా నిన్ను అంటూ కోపంతో చెప్పే డైలాగ్స్ ఎక్కువగా పాపులర్ అయ్యాయి.
ఎక్కువ మంది చదివినవి : Director Krishnavamsi : ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర నిజమే.. ఆ సీన్ ఎందుకు చేశామంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
ఈ చిన్నారి వడివేలు, వివేక్ వంటి హాస్యనటులతో నటించింది. మనస్వి విషయానికి వస్తే.. ఆమె తమిళంలో హాస్యనటుడు కొట్టచ్చి కూతురు. 2018లో త్రిష నటించిన ‘మోహిని’ చిత్రం ద్వారా బాలనటిగా మనస్వి తమిళ సినిమాలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమెకు పెద్ద పాత్ర రాలేదు. ఆమె తదుపరి చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. ఆ తరువాత ‘సుట్టుపిట్టిక్కు ఉతురు’ ,’ఇరుట్టు’ చిత్రాలలో నటించిన మనస్వి, 2019లో దిలీప్ నటించిన ‘మై శాంటా’ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా అరంగేట్రం చేసింది. 2020లో రజనీకాంత్ నటించిన ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘దర్బార్’ చిత్రంలో మనస్వి నయనతారకు కోడలిగా నటించింది. నయనతారతో ఇది ఆమె రెండవ చిత్రం.
ఎక్కువ మంది చదివినవి : Actress : హీరోయినే అసలు విలన్.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది మనస్వి. చివరగా చంద్రముఖి 2 చిత్రంలో కనిపించింది. ఇప్పుడు ఈ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. మనస్వి లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara – Trisha : 40 ఏళ్ల వయసులో చెక్కు చెదరని సోయగం.. నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోస్ వైరల్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..
