AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకు కాదిది ఔషధ గని.. ఎన్ని రోగాలకి చెక్ పెట్టొచ్చో తెలుసా..?

వాము ఆకులు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యానికి అమృతంగా పనిచేస్తాయి. జలుబు, గొంతులో గరగరతో బాధపడుతున్నవారికి వామ కులతో రసం చేసుకుని తాగితే కఫం అంతా క్లియర్ అవుతుంది. అంతేకాదు.. మంచి ఆరోగ్యంగా ఉండటానికి వాము ఆకులను, ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jan 22, 2026 | 11:19 AM

Share
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు వాము ఆకులను నమలడం వల్ల, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరంగా ఉంచడంలో మీకు సహాయపడుతుంది. వాము ఆకులను నీటిలో మరిగించి తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు దూరంగా ఉంటాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ఆకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

1 / 6
వాము ఆకులు మరిగించిన నీటిలో ఇంగువ, నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే, అది కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇవి అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి పంటి నొప్పి, తలనొప్పి, శరీర నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఆకులను మెత్తగా చేసి, ప్రభావిత ప్రాంతానికి లేపంగా అప్లై చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2 / 6
వాము ఆకులతో చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. చట్నీ చేయడానికి, ఆకులను వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మరసంతో కలిపి తయారు చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వామాకుల రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక తీవ్రమైన వ్యాధుల్ని నివారిస్తుంది. రోజూ రెండు ఆకులు నమలడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది.

3 / 6
వాము ఆకుల రసం తీసుకోవడం ఆర్థరైటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది కీళ్ల నొప్పులు, వాపుల్ని తగ్గించడంలో సాయపడుతుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

4 / 6
వాము ఆకుల రసం తాగడం వల్ల కళ్లకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కళ్లు, కంటి చూపును నిర్వహించడానికి అవసరం. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. వాము ఆకు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.

5 / 6
వాము ఆకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ తదితర ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది. వాము ఆకు తింటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. ఈ ఆకు తింటే అధిక రక్తపోటు సైతం నియంత్రణలోకి వస్తుంది.

6 / 6