IND vs NZ: తొలి టీ20లో సూర్య ఘోర తప్పిదం..! నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
India vs New Zealand, 1st T20I: గాయపడిన తిలక్ వర్మ స్థానంలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టీ20లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ ప్లాన్ విఫలమైంది.

IND vs NZ: న్యూజిలాండ్‌తో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్స్ విఫలమయ్యారు. అభిషేక్ శర్మ, రింకూ సింగ్ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో గాయపడిన తిలక్ వర్మ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్‌పై కీలక బాధ్యతలు ఉంచాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. దాదాపు ఏడాదిన్నర తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఇషాన్ కిషన్ ఎంతో ఒత్తిడిలో కనిపించాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఆడి ఒక ఫోర్ సహాయంతో 8 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ ప్రయత్నం విఫలమైంది. ఇప్పటికే ఇషాక్ కిషన్ మూడో స్థానంలో ఆడిన సమయంలో చెత్త రికార్డులు ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకోలేదేమోనని అనిపిస్తోంది.
ఇషాన్ కిషన్ దారుణ వైఫల్యంలో సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో ఇషాన్ ఉన్నాడనే కారణంతో సూర్యకుమార్ అతనికి ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ, ఇషాన్ వైఫల్యం జట్టుతోపాటు మేనేజ్మ్ంట్ ను ఆలోచనల్లో పడేసేలా చేసింది.
సూర్యకుమార్ యాదవ్ నిర్ణయంపై సందిగ్ధం?
టాస్ సమయంలో సూర్య మాట్లాడుతూ.. “ఇషాన్ మా ప్లాన్ లో ఉన్నాడు. కాబట్టి అతనికి తగినన్ని అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది” అని చెప్పుకొచ్చాడు. ఒక విధంగా ఇది సరైన నిర్ణయమే, కానీ, మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్ పై సమాలోచనలు మొదలయ్యాయి. గత కొన్ని టీ20 ఇన్నింగ్స్‌ల్లో నిలకడగా రాణించలేకపోవడం, తొలిసారి మ్యాచ్ ఆడుతున్న ఆందోళన స్పష్టంగా కనిపించింది.
జట్టులో మార్పులు జరిగేనా..?
ఇప్పటికే ఇషాన్ కిషన్ పై నమ్మకం ఉంచిన సూర్య, జనవరి 24న జరగనున్న రెండో టీ20లోనూ చోటు ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది. మరి రెండో టీ20లోనైనా ఇషాన్ తన పాత ఫాంలోకి తిరిగి వస్తాడని భావిస్తున్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్ ను మూడో నంబర్ లో బరిలోకి దించి, ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా పంపిస్తే బాగుంటుందని మాజీలు చెబుతున్నారు. సంజూ శాంసన్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. ఇషాన్ కిషన్ మాత్రం ఓపెనర్ గా అదరగొట్టాడు. కానీ మూడవ నంబర్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




