Sambaram Movie: నితిన్ ‘సంబరం’ మూవీ హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడేలా మారిందో చూశారా ?..
ఈ సినిమాలో కథానాయికగా నటించిన నిఖిత తుక్రాల్... అప్పట్లో ఎక్కువగా అభిమానులు ఉండేవారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. వేణు నటించిన కళ్యాణ రాముడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది నిఖిత. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఇప్పటికీ ప్రేక్షకులకు తన నటనతో గుర్తిండిపోయింది.

డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం సంబరం. 2003లో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో నితిన్, నిఖిత హీరోహీరోయిన్లుగా నటించగా.. ఆర్.పీ. పట్నాయక్ సంగీతం అందించారు. ఈ మూవీలో బెనర్జీ, సీత, గిరిబాబు, ఎస్.వీ. కృష్ణారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు కీలకపాత్రలు పోషించారు. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నా అమ్మాయి అబ్బాయి..ఆ తర్వాత ప్రేమికులుగా మారడం.. చివరకు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనేది కథాంశం. ఈ సినిమాలో కథానాయికగా నటించిన నిఖిత తుక్రాల్… అప్పట్లో ఎక్కువగా అభిమానులు ఉండేవారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. వేణు నటించిన కళ్యాణ రాముడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది నిఖిత. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఇప్పటికీ ప్రేక్షకులకు తన నటనతో గుర్తిండిపోయింది.
నికితా తుఘ్రాల్ పంజాబీ కుటుంబంలో పుట్టి ముంబైలో పెరిగింది. 2002లో హై అనే తెలుగు సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. కథానాయికగానే కాకుండా స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా కనిపించింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన తర్వాత కన్నడ బిగ్ బాస్ మొదటి సీజన్‌లో సెకండ్ రన్నరప్ టైటిల్‌ను గెలుచుకుంది. దాదాపు 99 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండి అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.
నిఖిత చివరిగా 2018లో కన్నడ చిత్రం రాజసింహలో కనిపించారు. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. ముంబైకు చెందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు నిఖిత. వీరికి ఒక పాప జన్మించింది. తెలుగులో 2016 శ్రీకాంత్ హీరోగా వచ్చిన టెర్రర్ సినిమాలో చివరిగా కనిపించింది. నిఖిత ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా నిఖిత ఫ్యామిలీ ఫోటోస్ నెట్టిటం వైరలవుతున్నాయి.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.