Bhamakalapam 2: ‘అనుపమ అనే నేను’.. ఆసక్తికగా ‘భామా కలాపం 2’ టీజర్..

ఓటీటీలో భామా కలాపం సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతుంది. టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భామా కలాపం. 2022 ఫిబ్రవరిలో వచ్చిన ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. థ్రిల్లర్, డార్క్ కామెడీగా వచ్చిన ఈ మూవీ ఆహా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు ఆదరణ లభించడంతో..

Bhamakalapam 2: 'అనుపమ అనే నేను'..  ఆసక్తికగా 'భామా కలాపం 2' టీజర్..
Bhamakalapam 2
Follow us

|

Updated on: Jan 30, 2024 | 8:28 PM

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసింది ప్రియమణి. పెళ్లైన కొత్తలో.. యమదొంగ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. చాలా కాలం గ్యాప్ తీసుకున్న ప్రియమణి.. బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరించింది. ఇక ఆ తర్వాతే ఓటీటీలో భామా కలాపం సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతుంది. టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భామా కలాపం. 2022 ఫిబ్రవరిలో వచ్చిన ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. థ్రిల్లర్, డార్క్ కామెడీగా వచ్చిన ఈ మూవీ ఆహా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు ఆదరణ లభించడంతో..ఇప్పుడు దీనికి సీక్వెల్ తీసుకువస్తున్నారు. భామా కలాపం 2 టైటిల్‍తో సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి నేరుగా ఓటీటీలోకి కాకుండా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. అనుపమ అనే నేను .. పక్కన వాళ్ల విషయాల్లో తలదూర్చనని.. నా పని నేను చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ కనిపిస్తుంది ప్రియామణి. తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తిని కలిగిస్తోంది. మొదటి పార్ట్ లో కథంతా ప్రియమణి చుట్టూ తిరిగినట్టుగానే రెండో పార్ట్ కూడా ఆమె కేంద్రంగానే నడవనున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి అభిమన్యూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీరత్ కపూర్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారీ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే.. ఈసారి సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మేంట్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి బాపినీడు బీ, సుధీర్ ఎదార.. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రుచికరమైన హెయిస్ట్ ఫీస్ట్ అనే ట్యాగ్ లైన్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?