Athadu Movie: ఏంటీ.. ఈ కుర్రాడు హీరో అయ్యాడా..? అతడు చైల్డ్ ఆర్టిస్ట్‏ను ఇప్పుడు చూస్తే..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తమదైన నటనతో మెప్పించిన చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారారు. అనేక చిత్రాల్లో తమదైన నటనతో తెలుగు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అందులో ఈ కుర్రాడు కూడా ఒకరు. అతడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ?

Athadu Movie: ఏంటీ.. ఈ కుర్రాడు హీరో అయ్యాడా..? అతడు చైల్డ్ ఆర్టిస్ట్‏ను ఇప్పుడు చూస్తే..
Siddharth
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 07, 2025 | 12:17 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ అతడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ సరసన త్రిష కథానాయికగా నటించగా.. సోనుసూద్, నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఇందులో వచ్చిన డైలాగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో త్రివిక్రమ్ రాసిన ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండడంతో థియేటటర్లలో విజల్స్ పడ్డాయి. ఇదెలా ఉంటే.. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన చిన్నోడు ఉన్నాడు కదా.. గుర్తున్నాడా. ?

ఆ చిన్నోడి పేరు దీపక్ సరోజ్. ఆ చిన్నోడికి, బ్రహ్మానందంకు మధ్య వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయించాయి. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపక్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో బాలనటుడిగా కనిపించి మెప్పించాడు. ఆర్య, భద్ర, మినుగురులు, లెజెండ్ వంటి సినిమాల్లో నటించాడు. అయితే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఆ చిన్నోడు.. ఇప్పుడు హీరో అయ్యాడు. ఇటీవలే డైరెక్టర్ వి.యశస్వి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు దీపక్.

ఇందులో దీపక్ జోడిగా తన్వి నేకి కథానాయికగా నటించింది. అంతకుముందే బంధనం అనే సినిమాలో హీరోగా నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక సిద్ధార్థ్ రాయ్ సినిమాతో హీరోగా పరిచయమైన దీపక్.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.