Subbu Movie: ‘సుబ్బు’ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా ?..

తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్స్ పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన కథానాయకలు ఇప్పుడు నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అలాంటి వారిలో ఎన్టీఆర్ హీరోయిన్ ఒకరు. ఇంతకీ ఎవరా అని అనుకుంటున్నారా ? తనే.. సోనాలి జోషి.

Subbu Movie: 'సుబ్బు' సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా ?..
Subbu Heroine
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 20, 2023 | 9:47 PM

తొలి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న అందం.. అభినయంతో తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకుంటారు. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి కథానాయికలుగా ఎక్కడున్నారు.. ఏం చేస్తుంటారనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి సెలబ్రెటీ గురించి క్షణాల్లో తెలిసిపోతుంది. తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్స్ పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన కథానాయకలు ఇప్పుడు నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అలాంటి వారిలో ఎన్టీఆర్ హీరోయిన్ ఒకరు. ఇంతకీ ఎవరా అని అనుకుంటున్నారా ? తనే.. సోనాలి జోషి.

ఈ పేరు ఎక్కువ మందికి తెలిసుండక పోవచ్చు. కానీ ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా సుబ్బు చిత్రంలో నటించింది. 2001లో డైరెక్టర్ సురేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సోనాలి కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో సోనాలికి అంతగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సందడే సందడి, నాన్న నేను అబద్ధం, రాంబాబు గాడి పెళ్లాం వంటి చిత్రాల్లో నటించింది. కానీ అవి కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

ఇవి కూడా చదవండి

దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గిపోయాయి. అలా నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనాలి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. గత ఫోటోస్.. ఇప్పుడు ఫోటోస్ చూస్తే ఆమెను గుర్తుపట్టడం మాత్రం చాలా కష్టమే. ప్రస్తుతం సోనాలి హిందీ సీరియల్లలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.