AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: అన్నయ్యకు బంగారు నాణేలతో అభిషేకం చేసిన రజినీకాంత్.. బంగారు మనసున్న సోదరుడిపై కనకవర్షం ఎందుకంటే..

ముఖ్యంగా కుటుంబానికి అత్యంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. సతీమణి.. కూతుర్లు.. మనవళ్లు.. బంధువులు... స్నేహితులతో సరదాగా గడుపుతుంటారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ సోషల్ మీడియాలో నిత్యం వైరలవుతుంటాయి.

Rajinikanth: అన్నయ్యకు బంగారు నాణేలతో అభిషేకం చేసిన రజినీకాంత్.. బంగారు మనసున్న సోదరుడిపై కనకవర్షం ఎందుకంటే..
Rajini Kanth
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 20, 2023 | 9:47 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్.. భారతీయ చిత్రపరిశ్రమలో ఆయన స్థానం ప్రత్యేకం. కేవలం తమిళంలోనే కాకుండా..తెలుగుతోపాటు.. ఉత్తరాదిలోనూ భారీగా ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్‏గా ఎంతటి స్టార్ డమ్ వచ్చినా.. సింప్లిసిటీకి నిలువెత్తు రూపం రజినీకాంత్. స్టార్ నటుడిగా చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా కుటుంబానికి అత్యంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. సతీమణి.. కూతుర్లు.. మనవళ్లు.. బంధువులు… స్నేహితులతో సరదాగా గడుపుతుంటారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ సోషల్ మీడియాలో నిత్యం వైరలవుతుంటాయి. తాజాగా ఆయన తన అన్నయ్య పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన సోదురుడిపై కనకవర్షం కురిపించారు సూపర్ స్టార్.

ఫిబ్రవరి 19న రజినీకాంత్ సోదరుడు 80 పుట్టినరోజు వేడుకలను బెంగళూరులో ఘనంగా నిర్వహించారు. అదే రోజు తన అన్నయ్య కుమారుడు రామకృష్ణ పుట్టిన రోజు కూడా కావడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వీరిద్దరి బర్త్ డే వేడుకలకు రజినీకాంత్ తన భార్య లత.. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా తన అన్నయ్యపై ప్రేమన చాటుకున్నారు. ఆయనకు ఏకంగా బంగారు నాణేలతో అభిషేకం చేశారు రజినీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే తన అన్నయ్య గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

“నా సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ 80వ పుట్టినరోజు.. అలాగే ఇదే రోజు తన కుమారుడు రామకృష్ణ 60వ పుట్టినరోజు. ఈ రెండు వేడుకలను ఒకేరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నన్ను ఈరోజు ఇలా మార్చిన ఈ బంగారు హృదయానికి బంగారు నాణేలతో అబిషేకం చేయడం చాలా సంతోషంగా ఉంది. దేవునికి కృతజ్ఞతలు ” అంటూ ట్వీట్ చేశారు రజినీ. ప్రస్తుతం ఆయన జైలర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.