Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hema: నటి హేమ కూతురు ఇషాను ఎప్పుడైనా చూశారా.. అచ్చం బాపు బొమ్మే

హేమ తన అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె తనయ ఇషా కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా...?

Hema:  నటి హేమ కూతురు ఇషాను ఎప్పుడైనా చూశారా.. అచ్చం బాపు బొమ్మే
Actress Hema
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 20, 2023 | 11:01 AM

హేమను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె బోలెడు సినిమాలు చేసింది. ముఖ్యంగా బ్రహ్మనందం కాంబినేషన్‌లో ఆమె చేసే సినిమాల్లోని సీన్స్ విపరీతంగా పేలేవి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో తన నటనకుగానూ ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డును గెలుచుకుంది హేమ. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించిన హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన పేరును హేమగా మార్చుకుంది.  250 పైచిలుకు సినిమాల్లో నటించింది హేమ. నిర్మోహమాటంగా మాట్లాడే మనస్థత్వం కావడంతో… వివాదాల్లో కూడా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మా ఎలక్షన్స్ సమయంలో.. ఆమె ప్రెస్ మీట్స్‌తో హొరెత్తిస్తుంది.  2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ జై సమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది హేమ. ప్రజంట్ ఎందుకో కానీ ఈమెకు  సినిమా అవకాశాలు తగ్గాయి.

హేమ పెద్దలను ఎదిరించి.. సయ్యద్ జాన్ అహ్మద్ అనే సినిమాటోగ్రాఫర్‌ను మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇషా అనే కుమార్తె ఉంది. ఇషాకు ప్రజంట్ 22 సంవత్సరాలు. హీరోయిన్‌ అయ్యే అన్ని ఫీచర్స్ ఈషాకు ఉన్నాయి. ఆమె చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అయితే సినిమాలపై ఇంట్రస్ట్ లేకపోవడంతో.. కుమార్తెను ఇండస్ట్రీకి దూరంగా పెంచింది హేమ. ఏమో మనసు మార్చుకుని ఈషా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రజంట్ ఈషా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Isha

Isha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.