- Telugu News Photo Gallery Cinema photos Actress Krithi Shetty Female Lead With Sharwanand Director Sriram Aditya Upcoming Movie telugu cinema news
Krithi Shetty : మళ్లీ జోరు పెంచిన బేబమ్మ.. ఈసారి శర్వానంద్‌తో జోడి కట్టనున్న కృతి శెట్టి..
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు.. మొదటి సినిమాతోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.
Updated on: Feb 20, 2023 | 1:27 PM

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు.. మొదటి సినిమాతోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ మూవీ ఎఫెక్ట్ తెలుగులో బేబమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు సినిమాలతో వరుసుగా డబుల్ హిట్స్ అందుకుంది.

అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి ఇప్పుడు వరుస ప్లాపులను ఎదుర్కొంటుంది. ఇటీవల నితిన్ సరసన నటించిన మాచర్ల నియోజకవర్గం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ .. నాగచైతన్య నటిస్తోన్న కస్టడీ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.

అయితే తాజాగా కృతికి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం కృతి శెట్టి యంగ్ హీరో శర్వానంద్ సరసన నటించనుందట.

ఇటీవలే ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకున్న శర్వానంద్.. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారట. ఇందులో కృతిని కథానాయికగా ఎంపిక చేసినట్లుగా సమాచారం.

మళ్లీ జోరు పెంచిన బేబమ్మ.. ఈసారి శర్వానంద్‌తో జోడి కట్టనున్న కృతి శెట్టి..

మళ్లీ జోరు పెంచిన బేబమ్మ.. ఈసారి శర్వానంద్‌తో జోడి కట్టనున్న కృతి శెట్టి..





























