Janaki Weds SriRam: ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ సినిమా హీరో గుర్తున్నాడా ?.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..
2003 సెప్టెంబర్ 11న విడుదలైన విడుదలైన జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు రోహిత్. డైరెక్టర్ అంజిశ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గజాలా, రేఖ వేదవ్యాస్, ఆహుతి ప్రసాద్, జి. నారాయణరావు కీలకపాత్రలలో నటించారు. అప్పట్లో ఈసినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా.. పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్.
ఒకప్పుడు తెలుగు తెరపై లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకుని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న హీరోస్ చాలా మంది ఉన్నారు. 90’s, 2000’s లో ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ చేసి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా.. ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అతి తక్కువ సమయంలోనే హిట్ చిత్రాల్లో నటించి ఆ తర్వాత స్టోరీస్ ఎంపికలో చిన్న చిన్న పొరపాట్లు చేసి కెరీర్ పోగొట్టుకున్నారు ఉన్నారు. ఇక హీరోగా మంచి ఫ్యాన్ బేస్ అందుకుని.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన హీరోల జాబితాలో రోహిత్ ఒకరు. 2003 సెప్టెంబర్ 11న విడుదలైన విడుదలైన జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు రోహిత్. డైరెక్టర్ అంజిశ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గజాలా, రేఖ వేదవ్యాస్, ఆహుతి ప్రసాద్, జి. నారాయణరావు కీలకపాత్రలలో నటించారు. అప్పట్లో ఈసినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా.. పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ తర్వాత 6టీన్స్, గర్ల్ ఫ్రెండ్, నేను సీతామాలక్ష్మి చిత్రాల్లో నటించారు. హీరోగా కెరీర్ మంచి ఫాంలో ఉండగా.. శంకర్ దాదా ఎంబీబీఎస్ .. నవ వసంతం చిత్రాల్లో కీలకపాత్రలలో నటించారు.
అయితే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు రోహిత్. కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ హీరో.. 2013లో హాఫ్ బాయిల్ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆతర్వాత రోహిత్ నటించిన పలు సినిమాలు కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా నటించారు రోహిత్. 2021లో వచ్చిన కళాకార్ చిత్రానికి శ్రీను బందెల దర్శకత్వం వహించగా.. రోహిత్ హీరోగా నటించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఇక ఆ తర్వాత మళ్లీ సినిమాకు దూరంగా ఉన్నారు రోహిత్. ఇటీవల జరిగిన మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా కనిపించలేదు. ప్రస్తుతం రోహిత్ వ్యాపార రంగంలో బిజీ అయినట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.