Sindhu Tolani: ‘గౌతమ్ SSC’ సినిమా హీరోయిన్ సింధు తులాని గుర్తుందా ?.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడెలా మారిందంటే..
దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఐతే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ సింధు. ముంబైకి చెందిన సింధు అచ్చం తెలుగమ్మాయిగా ఆడియన్స్ కు దగ్గరయ్యింది.
టాలీవుడ్ వెండితెరపై అగ్రకథానాయికలుగా కొనసాగి.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న తారల గురించి చెప్పక్కర్లేదు. నటనపరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. దీంతో ఆడపాదడపా చిత్రాల్లో నటించి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అందులో హీరోయిన్ సింధు తులాని ఒకరు. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఐతే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ సింధు. ముంబైకి చెందిన సింధు అచ్చం తెలుగమ్మాయిగా ఆడియన్స్ కు దగ్గరయ్యింది.
ఆ తర్వాత మన్మధ చిత్రంలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. యంగ్ హీరో నవదీప్ నటించి గౌతమ్ ఎస్ఎస్సీ, అతనొక్కడే, పౌర్ణమి, పోతే పోని, బతుకమ్మ, హరే రామ్, వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో సహయ నటిగా మెప్పించింది. కిక్, ప్రేమ కావాలి, ఇష్క్, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో పలు కీలకపాత్రలలో నటించింది సింధు.
చివరిసారిగా చిత్రాంగద చిత్రంలో కనిపించిన సింధు.. ఆ తర్వాత ఇప్పటివరకు మరో సినిమాలో కనపించలేదు. సింధు భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఐటీ ఆఫీసులో ఆమె భర్త చేతన్ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. వీరికి శ్వేత అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం తన కూతురు ఆలనాపాలనలోనే బిజీగా గడుపుతోంది సింధు.