MM Keeravaani : ఎంఎం కీరవాణికి అమెరికన్ ఫేమస్ ఫియానిస్ట్ స్పెషల్ సర్ప్రైజ్.. కన్నీళ్లు పెట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్..
తాజాగా అమెరికన్ ఫేమస్ పియానో విద్వాంసుడు ది కార్పెంటర్స్ ఫేమ్ రిచర్డ్ కార్పెంటర్ ఇచ్చిన స్పెషల్ సర్ ప్రైజ్ చూసి కీరవాణి ఎమోషనల్ అయ్యారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్గా సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం.. ఇటీవల 95వ ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన వేడుకలలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డ్స్ అందుకున్నారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే విదేశాల్లోని నటీనటులు సైతం మూవీ టీంను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. తాజాగా అమెరికన్ ఫేమస్ పియానో విద్వాంసుడు ది కార్పెంటర్స్ ఫేమ్ రిచర్డ్ కార్పెంటర్ ఇచ్చిన స్పెషల్ సర్ ప్రైజ్ చూసి కీరవాణి ఎమోషనల్ అయ్యారు.
మార్చి 15న ది కార్పెంటర్ ఫేమ్ రిచర్డ్ కార్పెంటర్ సంగీత దర్శకుడు కీరవాణి, చంద్రబోస్ లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశఆడు. తన కుటుంబసభ్యులతో కలిసి టాప్ ఆఫ్ ది వరల్డ్ కొత్త వెర్షన్ రికార్డ్ చేశాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అందుకున్నందుకు ఎంఎం కీరవాణి, చంద్రబోస్ కు అభినందనలు. మా కుటుంబం నుంచి మీకు ఇవే మా శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.
ఈ వీడియో చూసిన కీరవాణి భావోద్వేగానికి గురయ్యారు. రిచర్డ్ కార్పెంటర్ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. నేను అస్సలు ఊహించని విషయం ఇది. ఆనందంతో నాకు కన్నీళ్లు వస్తున్నాయి. ప్రపంచంలోనే అద్భుతమైన బహుమతి అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోపై రాజమౌళి స్పందిస్తూ.. నా సోదరుడు అన్ని సందర్భాల్లో భావోద్వేగానికి గురికాడు. తన ఎమోషన్స్ బయటకు రానివ్వడు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత తన కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు అంటూ రాసుకోచ్చాడు.
ఎంఎం. కీరవాణి ప్రతిష్టాత్మిక వేదికపై టాప్ ఆఫ్ ది వరల్డ్ కు అనుకరణగా సాంగ్ ఆలపించారు. ఈ వేదికపై కీరవాణి మాట్లాడుతూ.. “నేను కార్పెంటర్స్ వింటూ పెరిగాను. ఇక్కడ నేను ఆస్కార్ చేతిలో పట్టుకుని ఉన్నాను. నా మనసులో ఒకే ఒక కోరిక ఉంది. రాజమౌళి, నా కుటుంబానికి కూడా ఆర్ఆర్ఆర్ గెలవాలని ఉంది. ప్రతి భారతీయుడు గర్వపడాలి. నన్ను ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉంచాలి అని.” అంటూ చెప్పుకొచ్చాడు.