- Telugu News Photo Gallery Cinema photos Tamil Actress Aathmika Latest Photos Goes Viral In Social Media telugu cinema news
Aathmika : ప్రేమ కాదు.. కొన్నిసార్లు బ్రేకప్ కూడా మంచిదే.. మానసిక ఒత్తిడిని గెలిచిన అందాల అప్సరస..
దక్షిణాది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఆత్మిక. మీసేయ మీరుక్కు సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆత్మిక.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
Updated on: Mar 16, 2023 | 11:37 AM

దక్షిణాది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఆత్మిక. మీసేయ మీరుక్కు సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆత్మిక.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

తమిళ్ స్టార్ విజయ్ సరసన కోటియిల్ ఒరువన్ చిత్రంతోపాటు.. కాటేరి, నరకాసురన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ జోడిగా కన్నెనంబాదే చిత్రంలో నటిస్తోంది.

క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఈనెల 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆత్మీక తన ప్రేమ.. బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది.

తాను ఓ వ్యక్తిని మనసార ప్రేమించానని.. కానీ ఆ ప్రేమ తన జీవితంలో ఎంతో కాలం నిలవలేదని తెలిపింది. ప్రేమను కావాలనుకున్న తనకు.. ఏ కారణం లేకుండానే బ్రేకప్ చెప్పి వెళ్లిపోయాడని.. లవ్ బ్రేకప్ కారణంగా కొన్ని రోజులు రాత్రిళ్లు ఒంటరిగా ఏడ్చానని చెప్పింది.

అయితే లవ్ ఫెయిల్ కావడం అనేది ఇప్పుడు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. అయితే ఇకపై ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని.. తనకు రగ్డ్ వ్యక్తి.. స్మార్ట్ గా ఉండే వ్యక్తి వద్దని.. సాధారణంగా ఉండే మంచి మనసున్న అబ్బాయి అయితే చాలంటూ చెప్పుకొచిచింది.

కానీ ప్రస్తుతం పేరు, డబ్బు ప్రధాన అంశాలుగా ఉన్నాయని.. తాను మాత్రం తొలి ప్రాధాన్యం డబ్బుకే ఇస్తానని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆత్మిక తెలుగు తెరకు పరిచయం కాలేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడుకు భారీగానే ఫాలోయింగ్ ఉంది.

ప్రేమ కాదు.. కొన్నిసార్లు బ్రేకప్ కూడా మంచిదే.. మానసిక ఒత్తిడిని గెలిచిన అందాల అప్సరస..




