Godavari Movie: గోదావరి సినిమాలో సుమంత్ మరదలు గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
నీతూ చంద్ర.. పేరు చెబితే చాలా మందికి గుర్తు రాకపోవచ్చు కానీ.. గోదావరి సినిమాలో అక్కినేని సుమంత్ మరదలు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఇందులో ఆమె పోషించిన రాజీ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అంతకు ముందు మంచు విష్ణు మొదటి సినిమాలోనూ హీరోయిన్ గా నటించిందీ అందాల తార.

అక్కినేని సుమంత్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం గోదావరి. ఇందులో కమలినీ ముఖర్జీ మెయిన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. అయితే ఇదే గోదావరి సినిమాలో మరో రోల్ కూడా హైలెట్ గా నిలిచింది. అదే హీరో అక్కినేని సుమంత్ మరదలి పాత్ర రాజీ. ఈ రోల్ లో అద్భుతంగా నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది బాలీవుడ్ అందాల తార నీతూ చంద్ర. ఈ మూవీ ఆమెకు ఓవరాల్ గా మూడో సినిమా కాగా తెలుగులో రెండోది. అంతుకు ముందు మంచు విష్ణు మొదటి సినిమాలోనూ హీరోయిన్ గా మెరిసింది నీతూ చంద్ర. అలాగే రాజ శేఖర్ సత్యమేవ జయతే సినిమాలోనూ కథానాయికగా నటించి మెప్పించింది. ఇక అక్కినేని హీరోలందరూ నటించిన మనంలోనూ ఓ స్పెషల్ రోల్ చేసింది. ఇక హిందీలో అయితే జాన్ అబ్రహం, మాధవన్ తదితర స్టార్ హీరోలతో కలిసి హిట్ సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెద్దగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. 2021లో హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది
కాగా నీతూ చంద్ర మల్టీ ట్యాలెంటెడ్. క్లాసికల్ డ్యాన్స్ లో ఆమెకు నైపుణ్యం ఉంది. అలాగే కరాటేలో బ్లాక్ బెల్డ్ కూడా. చిన్నప్పుడే కరాటే, తైక్వాండో వంటి వాటిల్లో సత్తా చాటింది. ఈ క్రమంలోనే 2018లో ప్రో కబడ్డీ లీగ్ లో పాట్నా పైరేట్స్ కు నీతూ కమ్యూనిటీ అంబాసిడర్ గా మారింది. ప్రస్తుతం వ్యాపార రంగంలో బిజీ బిజీగా ఉంటోంది.
View this post on Instagram
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది నీతూ చంద్ర. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తుంటుంది. తాజాగా నీతూ షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గోదావరి సినిమాలో హోమ్లీగా కనిపించిన నీతూ చంద్ర ఇప్పుడు బొద్దుగా, మరింత హాట్ గా తయారైందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .




