Kiran Rathod: టాలీవుడ్ హాట్ బ్యూటీ కిరణ్ రాథోడ్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే స్టన్ అవుతారు
గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించింది కిరణ్ రాథోడ్. ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లోనే కనిపించిన ఈ అందాలతార కొన్ని బోల్డ్ మూవీస్ లోనూ నటించింది. ఇక ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్-7లోనూ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది.

తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ.. ఇలా ఎన్నో భాషల్లోనూ సినిమాలు చేసింది కిరణ్ రాథోడ్. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పుట్టి పెరిగిన ఆమె 2001లో హిందీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. ఆ తర్వాత శ్రీరామ్, నాని, అందరూ దొంగలే దొరికితే, చెప్పవే చిరుగాలి, భాగ్య లక్ష్మీ బంపర్ డ్రా, హైస్కూల్, కెవ్వు కేక తదితర సినిమాల్లో హీరోయిన్ గా , సెకెండ్ ఫీమెల్ లీడ్ రోల్స్ లో మెరిసింది. మరికొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ తళుక్కుమంది. తెలుగు తర్వాత ఎక్కువగా తమిళ్ సినిమాల్లోన నటించిందీ అందాల తార. విక్రమ్, కమలహాసన్, అజిత్, విజయకాంత్, ప్రశాంత్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే ఉన్నట్లుండి 2016లో సినిమాలు చేయడం ఆపేసింది కిరణ్ రాథోడ్. ‘ కథానాయకిగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో నా ప్రియుడు చెప్పిన మాటలు విని సినిమాలకు దూరం అయ్యాను. అయితే అదే నా జీవితంలో నేను చెసిన అతి పెద్ద తప్పు. దీంతో మళ్లీ నటించడానికి సిద్ధమయ్యాను. కానీ కొందరు నన్ను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేశారు. అడ్జెస్ట్‌మెంట్ కావాలని అడిగారు’ అని ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను వెళ్లగక్కింది కిరణ్ రాథోడ్.
2016 తర్వాత సినిమాల్లో కనిపించని కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొంది. ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ అందాల తార మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. తెలుగు రాకపోవడమే ఆమెకు పెద్ద శాపంగా మారింది. తెలుగు రాదనే వంకతో హౌస్‌మేట్స్ అందరూ ఆమెను నామినేట్ చేశారు. ఇక ఆడియెన్స్ కు కూడా ఆమె పెద్దగా కనెక్ట్ కాలేదు. దీంతో ఓట్లు కూడా పడలేదు. అందరికంటే తక్కువ ఓట్లు పడటంతో కిరణ్ మొదటి వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
కిరణ్ రాథోడ్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ కిరణ్ రాథోడ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ ను అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా కిరణ్ రాథోడ్ షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పడు నెట్టింట వైరలవుతున్నాయి.
గ్లామరస్ లుక్ లో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








