Janulyri: నేను ఎవరికీ భయపడేదాన్ని కాదు.. త్వరలోనే ఆ విషయం చెప్తా.. మరోవీడియో షేర్ చేసిన జాను..
ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయ్యింది జాను లిరి. సోషల్ మీడియాలో జాను సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. యూట్యూబ్ లో ఆమె సాంగ్స్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఆ క్రేజ్ తోనే టెలివిజన్ షోల్లో ఛాన్స్ లు అందుకుంది. పలు డాన్స్ షోల్లో పాల్గొంది జాను. అయితే ఈ మధ్య ఆమె పై ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాని పై జాను స్పందించింది.

గత కొద్ది రోజుల నుంచి డాన్సర్ జాను లిరి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తోనే టెలివిజన్ లో పలు షోల్లో పాల్గొనే అవకాశం అందుకుంది. అలాగే డాన్స్ షోలోనూ పాల్గొంది. అయితే జను లిరి పై కొందరు పనిగట్టుకొని ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెను అవమానపరిచేలా సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేయడం, నెగిటివ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు. దాంతో జాను ఓపిక నశించి ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. తన వ్యక్తిగత జీవితం గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని, తనకు చనిపోవాలని ఉంది అంటూ ఓ వీడియో షేర్ చేసింది.
సోషల్ మీడియాలో నాపై చాలా ట్రోల్స్ చేస్తున్నారు. నా మాటలను ఎడిట్ చేసి గలీజ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోలు నా కొడుకు చూడడా..? మీ వ్యూస్ కోసం ఒకమ్మాయి జీవితాన్ని రోడ్డుమీద పడేస్తున్నారు. నా తల్లిదండ్రులు నన్ను చిన్ననాటి నుంచి ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడుప్రతి అడ్డమైన వెదవ మాటలు పడాల్సి వస్తుంది. ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం అంటూ బోరున ఏడ్చింది జాను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఏం చేసినా నన్ను విమర్శిస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అంటూ ఆ వీడియోలో తెలిపింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ వీడియోను తొలగించింది.
ఇప్పుడు మరో వీడియో షేర్ చేసింది. ముందుగా అందరికి సారి నేను చేసిన వీడియో వల్ల బాధపడిన వారందరికీ సారి. అని తెలిపింది. అలాగే ఈ వీడియోలో తనకు సపోర్ట్ చేసిన అందరికి చాలా థాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది జాను. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా ఎప్పుడూ ఏది పట్టించుకోలేదు.. కానీ కొంచెం బాధ అనిపించి డిప్రషన్ లోకి వెళ్ళిపోయా.. నా ఫ్యామిలీ బాధ పడుతున్నారు.. దాని గురించి అలోచించి డిప్రషన్ లోకి వెళ్ళా.. నేను ఎవరికీ భయపడేదాన్ని కాదు.. భయపడితే ఈ స్టేజ్ లో ఉండేదాని కాదు.. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్.. నా పెళ్లి గురించి మీకెందుకు.. అవును నేను కొత్త లైఫ్ ను మొదలుపెట్టనున్నా.. ఆ విషయం సంతోషంగా చెప్తా.. నా కొడుకు లైఫ్ కోసం.. పెళ్లి చేసుకోబోతున్నా.. నిన్న చేసిన వీడియోలో చాలా మంది మంచి తీసుకున్నారు, చేడు తీసుకున్నారు.. ఇది ఎప్పటికీ ఆగదు.. ట్రోల్స్ చేస్తూనే ఉంటారు.నేను ఎప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంటా.. లైఫ్ లో ఇంకా ముందుకెళ్తా.. అందరికి థాంక్యూ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




