AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anu Mehta: అమ్మ బాబోయ్.. ఆర్య సినిమా హీరోయిన్ ఈ రేంజ్‏లో మారిపోయిందో చూశారా..? అస్సలు ఊహించలేరు..

అల్లు అర్జున్ కెరీర్‌లో మంచి బ్రేక్‌ని అందించిన ఈ సినిమా ఇటీవలే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈక్రమంలోనే ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలకు డైరెక్టర్ సుకుమార్, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈవేడుకలకు ఆర్య హీరోయిన్ అను మెహతా మాత్రం హజరుకాలేదు. నిజానికి ఆర్య తర్వాత అను ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు.

Anu Mehta: అమ్మ బాబోయ్.. ఆర్య సినిమా హీరోయిన్ ఈ రేంజ్‏లో మారిపోయిందో చూశారా..? అస్సలు ఊహించలేరు..
Aarya Movie
Rajitha Chanti
|

Updated on: May 11, 2024 | 8:34 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‏ను మలుపు తిప్పిన సినిమా ఆర్య. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన అందమైన ప్రేమకథ ఇది. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రోటిన్ ప్రేమకథలకు విభిన్నంగా వచ్చిన లవ్ స్టోరీ యూత్ కు తెగ కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా బన్నీకి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అటు మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తుంటాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో మంచి బ్రేక్‌ని అందించిన ఈ సినిమా ఇటీవలే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈక్రమంలోనే ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలకు డైరెక్టర్ సుకుమార్, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈవేడుకలకు ఆర్య హీరోయిన్ అను మెహతా మాత్రం హజరుకాలేదు. నిజానికి ఆర్య తర్వాత అను ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు.

ఆర్య తర్వాత తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో కనిపించింది. అలాగే కన్నడలో పలు సినిమాల్లో నటించింది. ఆర్య సినిమాలో అనురాధగా కనిపించింది అను మెహత. ఆర్య తర్వాత నువ్వంటే నాకిష్టం, వేడుక, మహారాజశ్రీ అనే సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు ఏవి బాక్సఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. చివరగా 2008లో కన్నడలో హొంగనసు అనే సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ చిత్రాల్లో నటించలేదు. అను మెహతకు సంబంధించిన విషయాలు కూడా అంతగా తెలియవు. అలాగే అను మెహతా సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ లేదు. కానీ ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోస్ మాత్రం నెట్టింట వైరలవుతున్నాయి. అను లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

కానీ అను మెహతా పేరుతో సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్ పేజీలు కనిపిస్తున్నాయి. అయితే అందులో అను సినిమా ఫోటోస్, సాంగ్స్ మాత్రం పోస్ట్ చేశారు. కానీ ప్రస్తుతం అను ఎలా ఉంది అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియరాలేదు. ఇటీవల జరిగిన ఆర్య 20 ఇయర్స్ సెలబ్రెషన్లలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఆర్య సినిమా తర్వాత అనును మళ్లీ చూడలేదని అన్నారు.

Anu Mehta

Anu Mehta

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.