AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయి దుర్గ తేజ్‌కు చెల్లిగా నటించిన ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.? ఆమె అందం చూస్తే ఫిదా అవ్వాల్సిందే

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొంతమంది భామలకు అదృష్టం కలిసి రాదు. ఎన్ని సినిమాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ ఫోటోలు, వీడియోలతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు.

సాయి దుర్గ తేజ్‌కు చెల్లిగా నటించిన ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.? ఆమె అందం చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Oct 05, 2025 | 4:40 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొంతమంది భామలకు అదృష్టం కలిసి రాదు. ఎన్ని సినిమాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ ఫోటోలు, వీడియోలతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే.. చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ కానీ అమ్మడి ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి.. కానీ క్రేజ్ మాత్రం కేక. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు చెల్లిగా నటించింది.. అలాగే నితిన్‌కు లవర్‌గా నటించింది ఈ ముద్దుగుమ్మ. అందంలో తనకు తానే సాటి.. పరువాలతో కుర్రకారును తన వలలో వేస్తుంది ఈ కుర్రాది.

ఇది కూడా చదవండి : ఇదేం సిరీస్‌రా అయ్యా..! సీన్ సీస్‌కు సుస్సూ పడిపోతుంది.. ఎక్కడ చూడొచ్చంటే

గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తొలి సినిమాతోనే అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రియా ప్రకాష్ వారియర్. ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కుగా బిజీగా గడిపేస్తోంది. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ ప్రియా ప్రకాష్ కు మంచి క్రేజ్ వచ్చింది.

ఇది కూడా చదవండి : బంపర్ ఆఫర్ కొట్టేసిన క్రేజీ బ్యూటీ.. దుల్కర్ సినిమాలో హీరోయిన్‌గా ఈ అమ్మడు

ఆతర్వాత మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. ఇక తెలుగులో నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాతో అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ మలయాళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది. మొన్నామధ్య పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో చేసింది. కానీ హీరోయిన్ గా కాదు. తేజ్ సిస్టర్ గా కనిపించింది ఈ భామ. ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా ఓకే చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటోంది. హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ చిన్నది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ మతి పోగొడుతున్నాయి.

ఇది కూడా చదవండి : బుర్రపాడు సిరీస్ బ్రో.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్ లు.. ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us