Singer Sunitha: జూన్ 13న అందాల సింగర్ సునీత లైవ్ కాన్సర్ట్.. ఎక్కడంటే
హైదరాబాద్‌లో సంగీత ప్రియులకు మరపురాని సంగీత వేడుకగా నిలవనున్న “టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట” కాన్సర్ట్ జూన్ 13న శిల్పాకల వేదికలో జరగనుంది. ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించారు సునీత. ఇక ఇప్పుడు టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట కాన్సర్ట్ తో అలరించనున్నారు.

హైదరాబాద్: వేదం ఆర్ట్ ఆధ్వర్యంలో జూన్ 13న, శిల్పకళావేదిక హైదరాబాద్‌లో సంగీత ప్రియులకు మరపురాని సంగీత వేడుకగా నిలవనున్న “టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట” కాన్సర్ట్‌కు సంబంధించిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో ముచ్చటించారు. కాన్సర్ట్ ప్రత్యేకతలు, సంగీత కాన్సెప్ట్, ప్రేక్షకులకు అందించబోయే అద్భుతమైన సంగీత అనుభూతి గురించి ఆమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కాన్సర్ట్‌లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్న ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణ మరియు ధనుజయ్ కూడా మీడియా సమావేశంలో పాల్గొని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : Banerjee: ఎవరైనా ఆ హీరో బయోపిక్ తీయాలి.. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కున్నాడు..
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, తరతరాల సంగీతాన్ని ఒకే వేదికపై ప్రేక్షకులకు అందించే ఈ ప్రత్యేక కాన్సర్ట్‌లో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. “టైమ్‌లెస్” ద్వారా స్వర్ణయుగంలోని చిరస్మరణీయ గీతాలతో పాటు నేటి ప్రేక్షకులు అభిమానించే మెలోడీలను కూడా అందించనున్నట్లు తెలిపారు. కాన్సర్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ, అమెరికా మరియు భారతదేశంలో భారీ స్థాయి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన వేదం ఆర్ట్మ్ సంస్థ హైదరాబాద్‌లో తమ ప్రతిష్టాత్మక కార్యక్రమంగా “టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట”ను తీసుకురావడం గర్వంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి :లేటుగా వచ్చాడని ఆ స్టార్ హీరోని రోజంతా ఎండలో నిలబెట్టారు.. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో పెద్ద స్టార్
తెలుగు సంగీత ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన స్వరాలలో ఒకరిగా సునీతకు ఉన్న ప్రత్యేక స్థానంతో ఈ అనుబంధం తమకు ఎంతో విశేషమని తెలిపారు. సంగీతం, జ్ఞాపకాలు, భావోద్వేగాలను ఒకే వేదికపైకి తీసుకురానున్న ఈ కాన్సర్ట్ హైదరాబాద్‌లో అత్యంత గుర్తుండిపోయే సంగీత సాయంత్రాలలో ఒకటిగా నిలవనుంది. “టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట” కాన్సర్ట్ టికెట్లు ప్రస్తుతం బుక్ మై షో లో అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి : వార్ని..! విజయ్‌తో ఉన్న ఈ చిన్నారి.. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకుంది
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




