AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: ‘కొత్త నియామకాలు, ఉద్యోగుల సంక్షేమం.. ఇదీ కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్’ సీఎం చంద్రబాబు

కొత్త నియామకాలు, ఉద్యోగుల సంక్షేమం తమ ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఇప్పటి వరకు సాధించిన ప్రోగ్రెస్‌ వివరాలను ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు పలు కీలక విషయాలను ఈ సమావేశంలో పంచుకున్నారు..

CM Chandrababu: 'కొత్త నియామకాలు, ఉద్యోగుల సంక్షేమం.. ఇదీ కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్' సీఎం చంద్రబాబు
AP CM Chandrababu
Srilakshmi C
|

Updated on: May 07, 2026 | 8:02 PM

Share

అమరావతి, మే 7: తమ ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన రోజే తొలి సంతకం మెగా DSC రిక్రూట్మెంట్‌పై చేసి.. మొత్తం 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించింది. ఆ తర్వాత 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలను కూటమి సర్కార్ పూర్తి చేసింది. స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచింది. ఈ ఏడాది 10 వేలకు పైగా పోస్టులతో కొత్తగా జాబ్ కేలండర్‌ను సైతం విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 23 నెలల్లో రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లించింది. మహిళా ఉద్యోగులకు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా మెటర్నిటీ లీవ్ మంజూరు చూస్తుంది. మరోవైపు పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ రంగాల్లో కూటమి ప్రభుత్వం పురోగతి సాధించింది.

28 నూతన పాలసీలు, పరిశ్రమలకు రాయితీల కోసం దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు తీసుకువచ్చింది. ఒక్క ఏడాదికి దేశంలోని పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి వచ్చాయి. దీంతో బిజినెస్ రిఫార్మర్ అవార్డు కూడా రాష్ట్రానికి దక్కింది. CII సమ్మిట్ 538 ఒప్పందాలు, రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.95 లక్షల ఉద్యోగాలకు కీలక ముందడుగు వేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. 17 SIPB సమావేశాల్లో రూ.11,37,222 పెట్టుబడులు, 10,01,147 లక్షల ఉద్యోగాలను రాష్ట్రానికి తీసుకువచ్చామని, 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా విశాఖని IT హబ్ గా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.

23 నెలల్లో గాడిలో పడిన పంచాయతీ రాజ్ వ్యవస్థ..

పల్లె పండుగ కింద గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అడవితల్లి బాటలో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, 4జీ నెట్‌వర్క్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చామన్నారు. 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల, 90కి పైగా CSS పథకాల పునరుద్ధరణ, ఇంకా తిరుమల సహా దేవాలయాల్లో సంస్కరణలు, 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాన్ కార్డ్ ఇనాక్టివ్ అయిందా..? ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..?
పాన్ కార్డ్ ఇనాక్టివ్ అయిందా..? ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..?
ఆ దెబ్బతో పుచ్చకాయలు తినడం మానేశా..
ఆ దెబ్బతో పుచ్చకాయలు తినడం మానేశా..
కోహ్లీ తన పని తాను చూస్కోకుండా.. ఎంతసేపు పక్కోడిని..!
కోహ్లీ తన పని తాను చూస్కోకుండా.. ఎంతసేపు పక్కోడిని..!
రోగాలు రమ్మన్నా రావు.. వర్షాకాలంలో ఇమ్యునిటీ పెంచే సూపర్ ఫుడ్స్‌
రోగాలు రమ్మన్నా రావు.. వర్షాకాలంలో ఇమ్యునిటీ పెంచే సూపర్ ఫుడ్స్‌
ఒక్కో సీన్ గూస్ బంప్స్.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..
ఒక్కో సీన్ గూస్ బంప్స్.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..
తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్
తెలంగాణలో ఎన్నికలు జరిగేది అప్పుడే.. గెలిచేది మేమే: సీఎం రేవంత్
రూ. లక్షన్నర జీతంతో.. TGPSC టౌన్ ప్లానింగ్ శాఖలో ఉద్యోగాలు
రూ. లక్షన్నర జీతంతో.. TGPSC టౌన్ ప్లానింగ్ శాఖలో ఉద్యోగాలు
గరుడ పురాణంలో చెప్పిన ఈ నియమాలతో మీ ఆర్థిక కష్టాలన్నీ మాయం!
గరుడ పురాణంలో చెప్పిన ఈ నియమాలతో మీ ఆర్థిక కష్టాలన్నీ మాయం!
ఈ20 పెట్రోల్ వాడటం సేఫ్ కాదా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదిగో
ఈ20 పెట్రోల్ వాడటం సేఫ్ కాదా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదిగో
అఖిల్ 'లెనిన్' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
అఖిల్ 'లెనిన్' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?