AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Butter Garlic Chicken: అతి సులువుగా, సూపర్ టేస్టీగా ఉండే బట్టర్ గార్లిక్ చికెన్, తింటే అదిరిపోద్ది

సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు, మన ఇంట్లో చికెన్ ఘుమఘుమలు ఉండాల్సిందే. ఎప్పుడూ చేసే చికెన్ కర్రీ లేదా ఫ్రై కాకుండా, ఈసారి కొంచెం వెరైటీగా ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటున్నారా? అయితే సులువుగా, సూపర్ టేస్టీగా ఉండే బట్టర్ గార్లిక్ చికెన్ చేసుకోండి. మన ఇంట్లో ఉండే మసాలాలతోనే రెస్టారెంట్ లెవెల్ రుచిని ఎలా తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకోండి. ఒక్క సారి తిన్నారో ఆ టేస్ట్ మర్చిపోలేరు.

Phani CH
|

Updated on: May 07, 2026 | 6:15 PM

Share
చికెన్ వంటకాల్లో అన్నింటికంటే ముఖ్యమైన ఘట్టం మ్యారినేషన్. ఒక పెద్ద బౌల్‌లో తాజా చికెన్ ముక్కలను తీసుకుని,  అందులోపెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా మిరియాల పొడి వేయాలి. ఇక్కడ మెయిన్ ట్రిక్ ఏంటంటే, వేయించిన ఉల్లిపాయలని చేత్తో నలిపి వేయడం. ఇది చికెన్‌కి అద్భుతమైన రుచిని ఇస్తుంది. 

1 / 5
వీటన్నింటినీ బాగా కలిపి కనీసం అరగంట సేపు పక్కన పెట్టేయండి. టైమ్ ఉంటే గంట సేపు ఉంచితే ముక్కకి మసాలా బాగా జ్యూసీగా తయారవుతుంది. తరువాత బాండీలో వెన్న కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలను వేసి దోరగా వేయించాలి. ఆ వెల్లుల్లి వాసన వస్తుంటేనే ఆకలి వేసేస్తుంది

2 / 5
ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి సన్నని మంట మీద ఉడికించాలి. చికెన్ లోని నీరు బయటకు వచ్చి గ్రేవీలా తయారవుతుంది. ఆ గ్రేవీ మెల్లమెల్లగా చిక్కబడుతూ ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు చికెన్ అసలైన రంగు బయటపడుతుంది. మంట ఎక్కువగా పెడితే ముక్క గట్టిగా అయిపోతుంది. తక్కువ మంటపై ఉడికించడం వల్ల ముక్క వెన్నలా మెత్తబడుతుంది.

3 / 5
మూత పెట్టి ఉడికించినప్పుడు ఆ మసాలాల సువాసనలన్నీ చికెన్ లోపలికి వెళ్లి అదిరిపోయే రుచిని ఇస్తాయి. చికెన్ దాదాపు ఉడికిన తర్వాత ఆఖర్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర చల్లితే వేడివేడి బటర్ గార్లిక్ చికెన్ రెడీ! ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ చూస్తుంటే ఎప్పుడు తిందామా అనే ఆత్రుత పెరిగిపోతుంది.

4 / 5
చివరగా కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్న వేడివేడి బటర్ గార్లిక్ చికెన్! ఇది చూడటానికే కాదు, తింటే కూడా స్వర్గంలా ఉంటుంది. ముక్కను ఇలా తుంచగానే అలా విడిపోతుంది, అంత సాఫ్ట్‌గా ఉంటుంది. దీన్ని పుల్కాలో పెట్టుకుని తిన్నా లేదా రైస్‌తో కలిపి తిన్నా ఆ అనుభూతే వేరు.

5 / 5
Follow Us
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..

నన్ను టచ్ చూస్తే ఆ దేశం భూమిపై ఉండదు.. బాంబుల వర్షమే..

3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!

తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..

వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్

మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే

ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!

ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!

వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?

బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!