AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్టార్ హీరోయిన్‌కు విడాకులిచ్చి రెండో పెళ్లి.. 58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రైన టాలీవుడ్ విలన్

ఈ నటుడు హిందీతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించాడు. నిర్మాతగానూ అభిరుచి చాటుకున్నాడు. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ సత్తా చాటాడు. ఇదే క్రమంలో ఒక స్టార్ హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. కానీ 19 ఏళ్ల వైవాహిక బంధానికి..

Tollywood: స్టార్ హీరోయిన్‌కు విడాకులిచ్చి రెండో పెళ్లి.. 58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రైన టాలీవుడ్ విలన్
Arbaaz Khan Family
Basha Shek
|

Updated on: Oct 05, 2025 | 4:35 PM

Share

ఒక స్టార్ హీరోకు సోదరుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోగా కాకున్నా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విలన్ గానూ భయపెట్టాడు. నిర్మాత గానూ అభిరుచి చాటుకున్నాడు. డబ్బింగ్ ఆర్టిస్టు గానూ మెప్పించాడు. హిందీతో పాటు తెలుగు, ఉర్దూ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసి ఆడియెన్స్ ను అలరించాడీ స్టార్ యాక్టర్. ఇదే క్రమంలో ఒక ప్రముఖ నటిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి దాదాపు 19 ఏళ్లు కాపురం చేశారు. వీరి అన్యోన్య దాంపత్య బంధానికి ప్రతీకగా ఒక బిడ్డ కూడా వీరి జీవితంలోకి అడుగు పెట్టాడు. అయితే అనూహ్యంగా వీరి దాంపత్య జీవితంలో గొడవలు, కలహాలు మొదలయ్యాయి. భార్యాభర్తలుగా కలిసుండలేమని పరస్పరం అనుమతితో విడాకులు తీసుకుని విడిపోయారు. 2017లో తన భార్యతో విడిపోయిన ఈ స్టార్ నటుడు సుమారు ఆరేళ్లు ఒంటరిగానే ఉన్నాడు. ఇదే క్రమంలో మరో నటితో ప్రేమలో పడ్డాడు. తన తోనే కలిసి రెండో సారి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు 58 ఏళ్ల వయసులో రెండో సారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతను మరెవరో కాదు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్.

నటి మలైకా అరోరాతో విడాకులు తీసుకున్న తర్వాత, అర్బాజ్ ఖాన్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను. 2023 డిసెంబర్ లో వీరి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం (అక్టోబర్ 05)న షురా ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన సల్మాన్‌ కూడా ఆస్పత్రికి వెళ్లాడు. కాగా అర్బాజ్‌ ఖాన్‌ ప్యార్‌ కియా తో డర్నా క్యా, హలో బ్రదర్‌, దబాంగ్‌, దబాంగ్‌ 2, దబాంగ్‌ 3, నిర్దోష్‌, తేరే ఇంతేజార్‌, మే జరూర్‌ ఆవుంగా తదితర సినిమాల్లో నటించాడు.

ఇవి కూడా చదవండి

భార్యతో అర్భాజ్ ఖాన్..

View this post on Instagram

A post shared by sshura Khan (@sshurakhan)

ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ మూవీలో విలన్‌గా నటించాడు ఆర్బాజ్ ఖాన్. అలాగే కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించాడీ సీనియర్ యాక్టర్.

సల్లూ ఫ్యామిలీ అంతా ఒకే చోట..

View this post on Instagram

A post shared by sshura Khan (@sshurakhan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us