AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా, రాజకీయంగానూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిశానిర్దేశంలా నిలిచింది. ప్రధానంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామనే స్పష్టమైన సంకేతాన్ని ఇస్తూ, యంత్రాంగం అందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు
Cm Chandrababu Naidu
Eswar Chennupalli
| Edited By: |

Updated on: May 07, 2026 | 9:33 PM

Share

త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలపై కలెక్టర్ల సదస్సులో సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించగలిగితే మరింత అభివృద్ధి సాధించగలమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైలు మార్గం ద్వారా ప్రతి కిలోమీటరుకు రూ.1.83 వ్యయం అవుతుంటే రహదారి మార్గంలో జరిగే రవాణాపై రూ.3.40 ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. రవాణా వ్యయం గణనీయంగా తగ్గితేనే ఏపీకి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా, రాజకీయంగానూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిశానిర్దేశంలా నిలిచింది. ప్రధానంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామనే స్పష్టమైన సంకేతాన్ని ఇస్తూ, యంత్రాంగం అందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

రాష్ట్రంలో క్షేత్రస్థాయి పాలనను బలోపేతం చేసేందుకు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. “గ్రామ, పట్టణ స్థాయిలో ప్రభుత్వ పనితీరు ప్రజలకు నేరుగా అనుభవంలోకి రావాలి. మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి” అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో ఉంచవద్దని, స్థానిక ఎన్నికల నాటికి ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సంతృప్తి ఉండాలని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి అధికారులకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఆఫీసుల్లో కూర్చుంటే డేటా మాత్రమే తెలుస్తుందని, క్షేత్రస్థాయిలోకి వెళ్తేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని, అధికారులు ఎక్కువ సమయం ప్రజల మధ్య గడపాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు 100% పరిష్కారం కావాలన్న ముఖ్యమంత్రి ముఖ్యంగా ఆర్థికేతర సమస్యలను ఫైళ్ల పేరుతో సాగదీయవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దేశానికే ఒక నమూనాగా నిలవాలని, జిల్లాల మధ్య అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆకాంక్షించారు.

చివరగా, తన కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు అదే సంస్థ ఏపీకి రావడం రాష్ట్ర పురోగతికి నిదర్శనమన్నారు. “ప్రజలకు కేవలం మాటలు కాదు, ఫలితాలు కావాలి. ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ అనేది కేవలం నినాదం కాదు, అది క్షేత్రస్థాయిలో కనిపించాలి” అని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us