ఆచితూచి అడుగులేస్తున్న అందాల భామ నివేధా థామస్

30 July  2026

Pic credit - Instagram

Rajeev 

క్రేజీ హీరోయిన్ నివేధా థామస్.. దక్షిణాది సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు ఈ అమ్మడిది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. అందం, అభినయంతో సినీప్రియులను ఆకట్టుకుంది నివేధా థామస్

గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేసి హిట్స్ అందుకుంది నివేధా థామస్.

అయితే ఈ బ్యూటీకి మంచి ఇమేజ్ వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. చివరిగా 35 చిన్న కథ అనే సినిమాలో తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

ఈ సినిమాలో ఆమె నటనకు ఏకంగా గద్దర్ అవార్డు కూడా అందుకుంది. ఈ మూవీలో తల్లి పాత్రలో నటించి మార్కులు కొట్టేసింది.

నివేదా థామస్.. కళ్లతోనూ హావభావాలు పలికించగల నటి. ఆమె కళ్లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన నిన్ను కోరి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది.

ఆ తర్వాత జై లవకుశ, బ్రోచేవారెవరురా, 118, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా 35 చిన్న కథ కాదు అనే చిత్రంలో నటించి మెప్పించింది.