సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ నభా నటేష్‌కు కలిసిరాని అదృష్టం.. 

30 July  2026

Pic credit - Instagram

Rajeev 

సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే  విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో అందాల భామ నభా నటేష్ ఒకరు.

ఆ ముద్దుగుమ్మ 2018లో సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. 

ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందీ అందాల తార.

రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ తన అందం నటనతో ఆకట్టుకుంది.ఈ సినిమాతో హిట్ తో వరుసగా అవకాశాలు అందుకుంది.

డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నటా నటేష్ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

కానీ సినిమాలు హిట్ అవ్వలేదు. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు తిరిగి కోలుకొని వరుసగా సినిమాలను లైనప్ చేసింది. ఇటీవలే నాగబంధం అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.