AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.? ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న బ్యూటీ ఆమె

చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న ఇండస్ట్రీలో ఎక్కువకాలం కంటిన్యూ అవ్వలేకపోతున్నారు. చేస్తున్నా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు కొందరు. దాంతో కొంతమంది ఇతర భాషల్లోకి చెక్కేస్తున్నారు. మరికొంతమంది సెకండ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.? ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న బ్యూటీ ఆమె
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2025 | 11:40 PM

Share

టాలీవుడ్​ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అది కంటెంట్ విషయంలో కావొచ్చు.. ఆర్టిస్టుల విషయంలో కావొచ్చు. అందం, అభినయం ఉన్న అమ్మాయిలను మనవాళ్లు ఎప్పుడూ ఆదరిస్తునే ఉంటారు. అలా ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అన్నీ కలిసిస్తే దశాబ్ధాల పాటు వారికి అవకాశాలు వెల్లువలా వస్తాయి. శ్రియ, త్రిష, నయనతార, కాజల్ వంటి హీరోయిన్స్‌ ఆ కోవకు చెందినవారే. ఇప్పుడు ఓ అమ్మాయి తెలుగు కుర్రాళ్లకు మోస్ట్ వాంటెడ్ క్వీన్‌గా మారింది. ఆ ఫోటోలను వాల్ పేపర్‌ కింద పెట్టుకుంటున్నారు చాలామంది. అలా ఈ పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా కొంతకాలం క్రితం టాలీవుడ్​కు ఎంటరయ్యింది​. 2018లో ఫెమినా మిస్ ఇండియా విజేతగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్​గా నిలిచింది. సుశాంత్ హీరోగా చేసిన ఓ సినిమాలో హీరోయిన్​గా చేసింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ బ్యూటీ స్క్రీన్ ప్రజెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఏంటి పోలికలను బట్టి ఏమైనా గుర్తుపట్టగలిగారా..? లేదా అయితే మేమే చెప్పేస్తాం.

తను మరెవరో కాదు మీనాక్షి చౌదరి. సుశాంత్​ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’లో చేసింది. ఆతర్వాత మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలో నటించి మెప్పించింది.

ఇవి కాక విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. అలాగే కొన్ని తెలుగు సినిమాలను ఓకే చేసింది.  ఇవికాక పలు తమిళ సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. మొత్తానికి ఈ బ్యూటీ కొన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో తన ముద్ర వేస్తుందన్న విషయం మాత్రం వాస్తవం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..