AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులో 17 సినిమాలు చేసినా రాని గుర్తింపు.. బాలీవుడ్‌లో మాత్రం తోప్ హీరోయిన్.. ఎవరో తెలుసా..

చాలా మంది హీరోయిన్స్ తెలుగులో వరుసగా సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ లోనో లేక తమిళ్ లోనే ఆఫర్స్ అందుకుంటూ.. అక్కడ బిజీ అవుతున్నారు.. అలాగే ఈ అమ్మడు కూడా తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. ఇంతకూ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

తెలుగులో 17 సినిమాలు చేసినా రాని గుర్తింపు.. బాలీవుడ్‌లో మాత్రం తోప్ హీరోయిన్.. ఎవరో తెలుసా..
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 28, 2025 | 9:08 AM

Share

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో ఈ అమ్మడు ఒకరు. తన అందంతో నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులో సూపర్ హిట్ సినిమాలు అందుకున్నప్పటికీ ఛాన్స్ లు అందుకోలేక బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో తోప్ హీరోల సరసన సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇంతకూ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా. ? ప్రభాస్ , రవితేజతోపాటు చాలా మంది యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆ బ్యూటీ మరెవరో కాదు క్రేజీ బ్యూటీ తాప్సీ. ఈ అందాల భామ ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మంచు మనోజ్ నటించిన ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. తరువాత 2011లో, వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ఆడుకలం చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.. ఆ తర్వాత తాప్సీ తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఈ బ్యూటీ 2013లో వరుణ్ ధావన్ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

వస్తాడు నా రాజు, మిస్టర్ పర్‌ఫెక్ట్, సాహ‌సం,ఆనందో బ్రహ్మ, మొగుడు లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తమిళ్‌లో కాంచన 2, వై రాజా వై, గేమ్ ఓవర్ సహా తమిళ చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత తాప్సీ బాలీవుడ్‌కి వెళ్లి మిషన్ మంగళ్, చాంత్ కి ఆంక్, తప్పట్, హసీన్ దిల్రూబా వంటి చిత్రాలకు మంచి అంచనాలు వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ అయిన సబాష్ మిథులో మిథాలీ రాజ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాప్సీ బేబీ, పింక్, ది ఘాజీ ఎటాక్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక నటిగా నిరూపించుకుంది. హిందీలో హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే ఈ అమ్మడికి వివాదాలు కూడా కొత్తేమి కాదు. పలు వివాదాల్లోనూ చిక్కుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.