Spotify Survey: చిట్టికి ఫిదా అవుతోన్న హైదరాబాదీలు.. మ్యూజిక్ యాప్ స్పోటిఫై సర్వేలో ఆసక్తికర విషయాలు.
Spotify Survey: సంగీతం అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమాను ఎక్కువగా ఇష్టపడే మన తెలుగు రాష్ట్రాల్లో వారు సంగీతం అంటే చెవ్వు కోసుకుంటారు. ఈ క్రమంలోనే అసలు హైదరాబాదీలు...
Spotify Survey: సంగీతం అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమాను ఎక్కువగా ఇష్టపడే మన తెలుగు రాష్ట్రాల్లో వారు సంగీతం అంటే చెవ్వు కోసుకుంటారు. ఈ క్రమంలోనే అసలు హైదరాబాదీలు ఎక్కువగా ఏ పాటను వింటున్నారు.? ఏ సింగర్‌ను అభిమానిస్తున్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పోటిఫై తాజాగా ఓ సర్వేను నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగానే తమ యాప్‌ను ఉపయోగిస్తున్న వారి డేటా విశ్లేషణ ఆధారంగా పలు విషయాలను స్పోటిఫై తెలిపింది.
హైదరాబాదీలు ఇప్పటి వరకు ఎక్కువగా విన్న, ప్రస్తుతం వింటోన్న పాటల్లో జాతిరత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ అనే పాట మొదటి వరుసలో నిలిచింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఉప్పెన సినిమాలోని జలజలపాతం నువ్వు, శశి సినిమాలోని ఒకేఒక లోకం నువ్వే, ఆచార్య సినిమాలోని లాహె లాహె, కలర్ ఫొటో సినిమాలోని తరగతి గది, సోలో బతుకే సో బెటర్ చిత్రంలోని హే ఇది నేనేనా, వకీల్ సాబ్‌లోని మగువా మగువా, గ్యాంగ్ లీడర్ చిత్రంలోని హోయ్‌నా హోయ్‌నా, ఆకాశం నీ హద్దురా సినిమాలోని కాటుక కనులె, శ్రీకారం చిత్రంలోని భలేగుంది బాలా పాటలు ఉన్నాయి.
ఇక హైదరాబాదీలు ఎక్కువగా వింటోన్న గాయకుల్లో సిద్ శ్రీరామ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్, అనిరుథ్ రవిచందర్, శ్రేయా ఘోషల్ తదితరులతో పాటు కె.ఎస్.చిత్ర, అనురాగ్ కులకర్ణి, ప్రీతమ్, దేవిశ్రీ ప్రసాద్, ఎఆర్‌రెహ్మాన్ వంటి వారు ఉన్నారు.
వలలో అరుదైన కచిడి చేపలు చిక్కాయి.. మత్సకారులకి సిరులు కురిపించాయి.. విలువంతా వాటి పొట్ట వల్లే