- Telugu News Photo Gallery Dont Eat Fish In Monsoon Season These Are The Side Effects Of Taking Fish In Rain Season
Fish In Monsoon Season: వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో చేపలను తినకూడదు.. తిన్నారో ఈ ప్రమాదాలు పొంచి ఉంటాయి సుమా.!
Fish In Monsoon Season: వర్షకాలంలో మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలని నిపుణులు చెబుతుంటారు. ఇలా ఈ కాలంలో తీసుకోకూడని ఆహారంలో చేపలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఇంతకీ వర్షాకాలానికి, చేపలకు లింక్ ఏంటనేగా మీ సందేహం...
Updated on: Aug 21, 2021 | 7:30 PM

ఇతర కాలాలతో పోలిస్తే వర్షకాలంలో వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.

ఎడతెరపి లేకుండా కురిసే వర్షాల కారణంగా వాతావరణం చల్లగా మారుతుంది. ఈ కారణంగానే ఆహారాన్ని వేడి వేడిగా తినమని వైద్యులు కూడా చెబుతుంటారు. 2

అయితే వర్షాకాలంలో తినకూడని ఆహార పదార్థాల్లో చేపలు కూడా ఒకటని మీకు తెలుసా? ఈ కాలంలో చేపలు ఆహారంగా తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే.

వర్షాకాలంలో సంతానోత్పత్తి కారణంగా చేపలలో అనేక రకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు కూడా తలెత్తే అవాకశాలున్నాయి.

కాలంలో నగరాల నుంచి బయటకు వచ్చే కాలుష్య వ్యర్థాలు నదులలో కలిసిపోతాయి. దీనివల్ల చేపలు అనారోగ్యానికి గురవుతాయి. అటువంటి పరిస్థితిలో జబ్బుపడిన చేపలు తింటే మీరు జబ్బు పడటం దాదాపు ఖాయం.

వర్షాకాలంలో చేపలు పట్టడాన్ని నిషేధిస్తంటారు. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా నిల్వ చేసిన వాటిని అమ్మే అవకాశాలుంటాయి. వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలుంటాయి.




