Jr NTR: అవునా.. నిజమా..! జూనియర్ ఎన్టీఆర్ సీరియల్‌లో యాక్ట్ చేశారని మీకు తెలీదా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకే పరిమితం కాలేదు. స్టార్ హీరోగా మారకముందే, ఈటీవీ ప్రారంభ దశలో వచ్చిన ఓ సీరియల్‌లో నటించారు. ఈ విషయం చాలామందికి తెలియదు..? ఆ డీటేల్స్ కంప్లీట్ గా ఈ కథనంలో తెలుసుకుందాం పదండి ...

టాలీవుడ్‌లో నందమూరి కుటుంబ వారసుడిగా అడుగుపెట్టి.. తనకంటూ సెపరేట్ ప్యాన్ బేస్ సెట్ చేసుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. సినిమాలే కాదు, స్మాల్ స్క్రీన్‌పై కూడా తన ప్రత్యేక ముద్ర వేసిన నటుడు ఆయన. తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్ అనే రియాలిటీ షోను మొదటగా పరిచయం చేసి, తనదైన స్టైల్లో సూపర్ హిట్‌గా మార్చారు. ఆ తరువాత జెమినీ టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు (KBC తెలుగు వెర్షన్)కి హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే, వరుస సినిమాలతో బిజీ అవ్వడంతో బిగ్‌బాస్ హోస్ట్‌గా తదుపరి సీజన్లకు కొనసాగలేకపోయారు.
ఇదంతా పక్కన పెడితే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు, రియాలిటీ షోలు మాత్రమే కాదు. ఒకప్పుడు టెలివిజన్ సీరియల్‌లో కూడా నటించారని చాలా మందికి తెలియదు. స్టార్ హీరోగా మారకముందే… చిన్న వయసులోనే ఆయన భక్త మార్కండేయ అనే మైథాలాజికల్ సీరియల్‌లో మార్కండేయుడి పాత్ర పోషించారు. ఈటీవీ మొదటిసారిగా ప్రసారం చేసిన ఆ సీరియల్ చాలా కొద్ది రోజులు మాత్రమే టెలికాస్ట్ అయ్యింది. శివభక్తుడి గెటప్‌లో చిన్న తారక్ కనిపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచే కళారంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చదువుతో పాటు డాన్స్, నటనలోనూ ప్రతిభ చూపుతూ.. ఇంటర్ చదివే రోజుల్లోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2000లో నిన్ను చూడాలనితో హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు, గుణశేఖర్ దర్శకత్వంలోని బాలరామాయణం సినిమాలో చిన్న రాముడి పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకే హీరోగా సెటిల్ అయ్యారు.
అలాగే… చిన్నప్పుడు తాత నందమూరి తారకరామారావు, బాబాయి బాలకృష్ణలతో కలిసి బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్‌లోనూ నటించారు. అయితే ఆ చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. ఇలా సినిమాలతో పాటు టెలివిజన్‌కి కూడా ఎన్టీఆర్ అనుబంధం కొనసాగుతూనే ఉంది. కాగా ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం ఈ నెల 14న విడుదల అవ్వనుంది.
Jr. NTR as ‘Bhakta Markandeya’ which is a TV Serial Telecasted In ETV
Though He Has Family Support In Movies…But He Chose To Come Up By His Own Path 💯💗@tarak9999 #KomaramBheeemNTR #NTR#Celebrating20YearsOfNTR pic.twitter.com/LKdENBlODM
— NTR – KING OF MASS (@KingJrNTR) August 19, 2020
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




