Tollywood: ఈ క్రికెటర్ ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. యాక్టింగ్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..
సోషల్ మీడియాలో చాలా మంది స్టార్స్ త్రోబ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. చిన్ననాటి ఫోటోలతోపాటు టీనేజ్ పిక్స్ సైతం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు అతను తోపు హీరో. యాక్టింగ్ చూస్తే అభిమానులు కావాల్సిందే.

సినీరంగంలోకి నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతోమంది కలలు కంటారు. ఎన్నో అడ్డంకులు, అవమానాలను ఎదుర్కొని వెండితెరపై సందడి చేస్తుంటారు. ఇతర రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తూ మెప్పించినవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో క్రికెటర్ గా కనిపిస్తున్న ఆ కుర్రాడు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరో. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అండర్ 19 క్రికెట్ స్టేట్ ప్లేయర్. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా..? యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హీరో.. అతడే హీరో శ్రీవిష్ణు.
చిన్న చిన్న సినిమాలతోనే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు శ్రీవిష్ణు. వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాణం, సోలో, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల్లో చిన్న పాత్రలు చేశాడు. 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆతర్వాత సెకండ్ హ్యండ్ చిత్రం, 2016లో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలతో ఫేమస్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీవిష్ణు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు శ్రీవిష్ణు ఆంధ్ర ప్రదేశ్ అండర్ -19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడట.
తెలుగులో శ్రీవిష్ణు నటించిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ,వీర భోగ వసంత రాయలు, బ్రోచేవారెవరురా, గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణ, సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవలే స్వాగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..




