AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరోను పిచ్చిగా ప్రేమించింది.. భర్త చేతిలో మోసపోయి.. కోట్ల ఆస్తిని దానం చేసిన హీరోయిన్..

తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమె అందానికి జనాలు ఫిదా అయ్యారు. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీని ఏలిన ఈ హీరోయిన్ వ్యక్తిగత జీవితం మాత్రం కన్నీళ్లతో సాగింది. ఓ స్టార్ హీరోను ఎంతో ప్రేమించింది. కానీ వారి బంధం పెళ్లి వరకు రాలేదు. ఆ తర్వాత భర్త చేతిలో దారుణంగా మోసపోయింది. దీంతో కోట్ల ఆస్తిని దానం చేసింది.

ఆ స్టార్ హీరోను పిచ్చిగా ప్రేమించింది.. భర్త చేతిలో మోసపోయి.. కోట్ల ఆస్తిని దానం చేసిన హీరోయిన్..
Srividya
Rajitha Chanti
|

Updated on: Sep 03, 2025 | 8:40 AM

Share

దక్షిణాదిని ఏలిన సూపర్ స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఒకప్పుడు ఆమె అందానికి, నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం ఒడిదుడుకులతో సాగింది. చివరకు మరణించే ముందు తన కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసింది. ఆమె మరెవరో కాదు.. దివంగత నటి శ్రీ విద్య. 953లో జన్మించారు. ఆమె తండ్రి హాస్యనటుడు కృష్ణమూర్తి. తల్లి కర్ణాటక గాయని ఎం.ఎల్. వసంత కుమారి. శ్రీ విద్య జన్మించిన ఒక సంవత్సరం తర్వాత, ఆమె తండ్రి కృష్ణమూర్తి ఒక ప్రమాదం కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదేం సినిమా రా బాబోయ్.. యాక్షన్, సస్పెన్స్, ట్విస్టులతో బుర్రపాడు.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది..

ఆ సమయంలో శ్రీవిద్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కుటుంబ బాధ్యతలు తీసుకున్న శ్రీవిధ్య కేవలం 14 సంవత్సరాల వయస్సులో నటిగా తెరంగేట్రం చేసింది. శ్రీవిద్య తన నటనా జీవితాన్ని తిలగం శివాజీ గణేషన్ చిత్రం ‘తిరువారుచెల్వన్’ తో ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె ‘పెట్టరాశి పెట్టమ్మ’ చిత్రంలో కనిపించింది. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షఖులను కట్టిపడేసింది. దీంతో ఆమెకు సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..

తమిళ సినిమా రంగంలో అత్యుత్తమ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంలో శ్రీవిద్య రజనీకాంత్, కమల్ హాసన్ లతో కలిసి నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. శ్రీవిద్య తమిళం, తెలుగు భాషలలో కథానాయికగా నటించింది. శ్రీవిద్య చాలా సినిమాల్లో కమల్ హాసన్ తో జత కట్టింది. మొదట్లో స్నేహితులు.. ఆ తర్వాత వారు ప్రేమలో పడ్డారు. కానీ వీరి పెళ్లికి శ్రీవిద్య తల్లి అంగీకరించలేదు. దీంతో 1978లో శ్రీవిద్య మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత తన కెరీర్‌ను తన భర్త కోసం త్యాగం చేసింది.

ఇవి కూడా చదవండి :  Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..

వైవాహిక బంధం అంత సాఫీగా సాగలేదు. ఆమె ఆస్తిని భర్త లాక్కోవడం.. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆమెను తీవ్రంగా వేధించారు. దీంతో వీరిద్దరు1980లో విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీవిద్య.. ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ అదే సమయంలో ఆమె క్యాన్సర్ బారిన పడింది. దీంతో తన కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. నటుడు గణేష్ సహాయంతో, శ్రీవిద్య ఒక ఫౌండేషన్‌ను స్థాపించి, పేదల విద్యార్థులకు తన ఆస్తిని అందించింది. మూడు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడిన విద్య 2006లో 53 సంవత్సరాల వయసులో మరణించింది.

Srividya. New

Srividya. New

ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..

Follow Us