AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు థైరాయిడ్ ఉందా.. వీటికి దూరంగా చాలు ఈజీగా తగ్గించుకోవచ్చు..

కారణం లేకుండానే బరువు పెరుగుతున్నారా? జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఎప్పుడూ నీరసంగా, ఉత్సాహం లేనట్టుగా అనిపిస్తోందా? అయితే అది కేవలం అలసట మాత్రమే కాకపోవచ్చు.. మీ శరీరంలోని థైరాయిడ్ గ్రంథి ఇస్తున్న ప్రమాద సంకేతం కావచ్చు. సైలెంట్ కిల్లర్‌లా మారుతున్న ఈ థైరాయిడ్ సమస్యను ఆహారంతో ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం..

మీకు థైరాయిడ్ ఉందా.. వీటికి దూరంగా చాలు ఈజీగా తగ్గించుకోవచ్చు..
Stop Eating These Foods If You Have Thyroid
Krishna S
|

Updated on: Apr 05, 2026 | 1:48 PM

Share

మారుతున్న జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి కారణంగా ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్యలు సైలెంట్ కిల్లర్‌లా విస్తరిస్తున్నాయి. మెడ భాగంలో ఉండే ఈ చిన్న గ్రంథి.. శరీర జీవక్రియను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అదుపు తప్పితే బరువు పెరగడం, జుట్టు రాలడం, విపరీతమైన అలసట వంటి సమస్యలు చుట్టుముడతాయి. అయితే సరైన ఆహార నియమాలు పాటిస్తే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

థైరాయిడ్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి

థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.

సోయా ఉత్పత్తులు: సోయా బీన్స్, సోయా పాలు థైరాయిడ్ మందుల పనితీరుకు ఆటంకం కలిగించవచ్చు.

పచ్చి కూరగాయలు: క్యాబేజీ, బ్రోకలీ, క్యాలిఫ్లవర్ వంటి వాటిని పచ్చిగా తినకూడదు. వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల అందులోని గోయిట్రోజెన్స్ ప్రభావం తగ్గుతుంది.

జంక్ ఫుడ్ – షుగర్: ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర, ఉప్పు ఉండే పదార్థాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి.

కెఫీన్ – ఆల్కహాల్: కాఫీ, టీలు, మద్యం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.

ఆహారంలో చేర్చుకోవాల్సిన సూపర్ ఫుడ్స్

థైరాయిడ్ గ్రంథి చురుగ్గా పనిచేయడానికి ఈ పోషకాలు అవసరం..

అయోడిన్: పాల ఉత్పత్తులు, చేపలు మరియు అయోడైజ్డ్ ఉప్పు పరిమితంగా తీసుకోవాలి.

సెలీనియం – జింక్: బాదం, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, తృణధాన్యాలు హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి.

ప్రోటీన్: గుడ్లు, పనీర్, శనగలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం జీవక్రియను మెరుగుపరుస్తుంది.

ఆకుకూరలు: తాజా పండ్లు, ఆకుకూరలు శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తాయి.

జీవనశైలిలో ఈ 5 మార్పులు చేసుకోండి

కేవలం ఆహారం మాత్రమే కాదు, అలవాట్లు కూడా మారాలి..

వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఒత్తిడి నిర్వహణ: మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల హార్మోన్లు అదుపులో ఉంటాయి.

నిద్ర: రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర హార్మోన్ల రీసెట్‌కు అవసరం.

క్రమం తప్పని పరీక్షలు: ప్రతి 3 లేదా 6 నెలలకు ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి.

Follow Us