AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అర్జున్ కూతురి రిసెప్షన్‏లో మెరిసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆ స్టార్ హీరో కూతురే ఈ వయ్యారి..

ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సత్యరాజ్, ఖుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివకార్తికేయన్, హీరోయిన్ స్నేహా తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ వేడుకలో ఓ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

Tollywood: అర్జున్ కూతురి రిసెప్షన్‏లో మెరిసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆ స్టార్ హీరో కూతురే ఈ వయ్యారి..
Anoushka
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2024 | 9:03 AM

Share

యాక్షన్ హీరో అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు తంబి రామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతితో ఈనెల (జూన్ 10న) ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. ఇరుకుటుంబాల సహా అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగ్గా.. శుక్రవారం (జూన్ 14న) చెన్నై లీలా ప్యాలెస్‏లో వీరి రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సత్యరాజ్, ఖుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివకార్తికేయన్, హీరోయిన్ స్నేహా తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ వేడుకలో ఓ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

పైన ఫోటోను చూశారు కదా.. ఐశ్వర్య పక్కనే బ్లాక్ ట్రెండీ ట్రెడిషనల్ వేర్‏లో సరదాగా నవ్వుతూ కనిపిస్తున్న అమ్మాయి.. ఎవరో తెలుసా.. ? చిరునవ్వుతోనే కుర్రాళ్ల గుండెలకు గాయం చేస్తున్న ఆ బ్యూటీ ఓ స్టార్ హీరో గారాలపట్టి. ఆ బ్యూటీ తల్లిదండ్రులు ఇద్దరూ టాప్ నటీనటులే. ఇండస్ట్రీలో తమకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన తల్లితో కలిసి అర్జున్ కూతురు ఐశ్వర్య, ఉమాపతి రిసెప్షన్‏లో సందడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరో కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. హీరోయిన్స్ కంటే ఎంతో అందంగా, అమాయకంగా కనిపిస్తూ మంత్రముగ్దులను చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ముద్దుల కూతురు అనౌష్క.

ఐశ్వర్య రిసెప్షన్ వేడుకలో తన తల్లి షాలినితో కలిసి హాజరైంది అనౌష్క. మొదటిసారి తన తల్లితో కలిసి ఇలా మీడియా ముందుకు వచ్చింది అనౌష్క. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అజిత్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విదిముయార్చి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో