AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram: కాలినడకన తిరుమలకు త్రివిక్రమ్.. గురూజీ తనయుడిని చూశారా? హీరో మెటీరియల్

ప్రముఖ దర్శకుడు, మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. త్రివిక్రమ్ తో పాటు ఆయన భార్య, కుమారుడు ఇతర కుటుంబ సభ్యులు ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి కాలినడకన వెళ్లారు. శ్రీవారి మెట్ల మార్గంలో త్రివిక్రమ్ కుటుంబ సభ్యులు కాలినడకన వెళుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Trivikram: కాలినడకన తిరుమలకు త్రివిక్రమ్.. గురూజీ తనయుడిని చూశారా? హీరో మెటీరియల్
Trivikram Srinivas Family
Basha Shek
|

Updated on: Jun 18, 2024 | 9:33 AM

Share

ప్రముఖ దర్శకుడు, మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. త్రివిక్రమ్ తో పాటు ఆయన భార్య, కుమారుడు ఇతర కుటుంబ సభ్యులు ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి కాలినడకన వెళ్లారు. శ్రీవారి మెట్ల మార్గంలో త్రివిక్రమ్ కుటుంబ సభ్యులు కాలినడకన వెళుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇవాళ ఉదయం VIP దర్శన సమయంలో త్రివిక్రమ్ స్వామివారిని దర్శించుకున్నారు. కాగా త్రివిక్రమ్ సతీమణి సౌజన్య పలుమార్లు కనిపించినా పిల్లలు మాత్రం అసలు కనిపించరు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కుమారుడు కూడా తాజా వీడియోలో కనిపించాడు. రిషి మంచి హైట్, కళ్లజోడు పెట్టుకుని అచ్చం నాన్నలా స్టైలిష్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. త్రివిక్రమ్ కుమారుడు హీరోలా ఉన్నాడంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అనూహ్యంగా తిరుమల శ్రీవారి పర్యటన చేపట్టడంపై  సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తన క్లోజ్ ఫ్రెండ్ పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందునే త్రివిక్రమ్ కాలి నడకన వచ్చి శ్రీవారిని దర్శించుకోనున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే అదేమీ కాదని సమ్మర్ పూర్తవుతుంది కాబట్టే క్యాజువల్ గానే త్రివిక్రమ్ తిరుమల శ్రీవారి దర్శించుకోనున్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది  సంక్రాంతికి  గుంటూరు కారం సినిమాతో మన ముందుకు వచ్చారు త్రివిక్రమ్. మహేశ్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ యూట్యూబ్ రికార్డులు కొల్ల గొట్టింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

తిరుమలకు వెళుతోన్న త్రివిక్రమ్..

వీడియో ఇదిగో…

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా