AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pavithra Gowda: కిరాణా షాపు నుంచి కోటీశ్వరురాలి దాకా.. పవిత్ర గౌడ లైఫ్ జర్నీ చూస్తే మైండ్ బ్లాక్

నటి పవిత్ర గౌడ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి కిరాణా దుకాణం యజమాని. బిషప్ కాటన్ కాలేజీలో బీసీఏ డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. పవిత్ర గౌడ పలు జ్యువెలరీ స్టోర్స్‌కు సంబంధించిన ప్రకటనల్లో కనిపించింది.

Pavithra Gowda:  కిరాణా షాపు నుంచి  కోటీశ్వరురాలి దాకా.. పవిత్ర గౌడ లైఫ్ జర్నీ చూస్తే మైండ్ బ్లాక్
Darshan, Pavithra Gowda
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2024 | 8:35 AM

Share

రేణుకాస్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. సినీ పరిశ్రమలోని స్టార్ హీరో దర్శన్ ప్రియురాలి మోజులో పడి వీరాభిమానినే దారుణంగా హత్య చేశాడు. ఇప్పుడు కటాకటాల పాలయ్యాడు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతో సహా మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని.. అలాగే రేణుకాస్వామి భార్యకు న్యాయం జరగాలి అటు ప్రజలు.. ఇటు సినీతారలు కోరుతున్నారు. అయితే దర్శన్ తన అభిమానిని ఇంత దారుణంగా హింసించి హత్య చేయడానికి ప్రధాన కారణం ప్రియురాలు పవిత్ర గౌడ. ఇప్పటికే పెళ్లై బాబు ఉన్న దర్శన్.. గత పదేళ్లుగా నటి పవిత్ర గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు. కొన్నిరోజులుగా పవిత్రగౌడకు.. దర్శన్ భార్య విజయలక్ష్మికి సోషల్ మీడియా వేదికగా పెద్ద గొడవలే జరిగాయి. దీంతో దర్శన్ వీరాభిమాని రేణుకస్వామి పవిత్రగౌడకు నెట్టింట అసభ్యకరంగా మెసేజ్ లు చేయడం.. ట్రోల్స్ చేయడంతో దర్శన్ అతడిని కిడ్నాప్ చేయించి హత్య చేశాడు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నెట్టింట పవిత్ర గౌడ పేరు మారుమోగుతుంది. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ చిన్న కిరాణా షాపు యజమాని కూతురు ఇప్పుడు కోటీశ్వరాలు ఎలా అయ్యింది ? అంటూ నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది.

నటి పవిత్ర గౌడ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి కిరాణా దుకాణం యజమాని. బిషప్ కాటన్ కాలేజీలో బీసీఏ డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. పవిత్ర గౌడ పలు జ్యువెలరీ స్టోర్స్‌కు సంబంధించిన ప్రకటనల్లో కనిపించింది. మోడల్ ప్రపంచంలో మిస్ బెంగళూరుగా నిలిచింది. మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి.. ఆ తర్వాత రెండు సినిమాల్లో కథానాయికగా కనిపించింది. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది. కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర గౌడకు అంతగా గుర్తింపు కూడా రాలేదు. కేవలం హీరో దర్శన్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచింది. పవిత్ర గౌడకు ఇదివరకే పెళ్లైంది. సంజయ్ సింగ్ అనే సామాన్యుడిని పెళ్లి చేసుకున్న పవిత్ర కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న పవిత్రకు హీరో దర్శన్‏తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది.

దర్శన్‏తో ప్రేమ, లివ్ ఇన్ రిలేషన్ షిప్‏తో పవిత్ర గౌడ ఒక్కసారిగా కోటీశ్వరురాలైందని అంటున్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న పవిత్ర గౌడకు ఆర్ఆర్ నగర్‌లోని మూడంతస్తుల ఇంటిని కూడా దర్శన్ బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఇక ఓ లగ్జరీ కారు విషయంలో దర్శన్ భార్య విజయలక్ష్మి, పవిత్రకు మధ్య సోషల్ మీడియాలో పెద్ద గొడవే జరిగింది. భార్యకు దర్శన్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడని తెలిసి తనకు అదే కారు కావాలని కోరింది పవిత్ర గౌడ. దీంతో తన భార్య విజయలక్ష్మికి ఇచ్చిన మోడల్ కారునే పవిత్రగౌడ్ కు బహుమతిగా ఇచ్చాడు. పవిత్ర ఉంటున్న ఇంటిని కూడా దర్శన్ స్వయంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us