AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ క్రేజ్.. చూస్తే యమా హాట్.. ఎవరో గుర్తుపట్టారా.?

పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.! ఇప్పుడొక స్టార్ హీరోయిన్. తెలుగులో ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

Tollywood: ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ క్రేజ్.. చూస్తే యమా హాట్.. ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood
Ravi Kiran
|

Updated on: Mar 31, 2023 | 9:31 AM

Share

నటీమణులుగా ఎన్ని సినిమాలు చేసినా.. వారి కెరీర్‌ను మలుపు తిప్పేది కచ్చితంగా ఏదొకటి ఉంటుంది. ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే.. ఆచితూచి అవకాశాలను ఎంచుకోవాలి. ఇలా చేసే హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. ఇక మీరు పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.! ఇప్పుడొక స్టార్ హీరోయిన్. తెలుగులో ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

సెలెక్ట్‌డ్‌గా కథలను ఎంచుకుంటూ.. ఒకవైపు హోమ్లీ క్యారెక్టర్స్.. మరోవైపు గ్లామర్ టచ్‌తో కుర్రకారును చంపేస్తుంది ఈ అమ్మడు. మోడలింగ్ నుంచి బుల్లితెరకు.. అక్కడ సక్సెస్ సాధించి.. ఆ తర్వాత వెండితెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. వాస్తవానికి నార్త్‌లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌కు లవ్ స్టోరీ ద్వారా పరిచయమై.. యావత్ సౌత్‌లో సూపర్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. తన కెరీర్‌లో తొలి సూపర్ హిట్‌ను అందుకుంది. ఆమెవరో గుర్తుపట్టారా.?

ఎస్! మీరనుకున్నది కరెక్ట్.. ఆ బ్యూటీ మరెవరో కాదు.. మృణాల్ ఠాకూర్. సీతారామం మూవీతో తెలుగు డెబ్యూ చేసిన ఈ అందాల ముంబై భామ. తొలి చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ దక్కించుకోవడమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఎంతగానో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత హిందీలో అక్షయ్ కుమార్ సరసన ఓ చిన్న పాత్ర చేసి.. తనలోని గ్లామర్ టచ్‌ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాని సరసన ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.