AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : యోగా టీచర్‏గా వచ్చి హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే టాప్ హీరోలతో సినిమాలు..

సౌత్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్. అందం, అభినయంతో తెలుగువారిని మెస్మరైజ్ చేసింది. రవితేజ, నాగార్జున, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. పాన్ ఇండియా సినీప్రియులకు ఇష్టమైన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?

Tollywood : యోగా టీచర్‏గా వచ్చి హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే టాప్ హీరోలతో సినిమాలు..
Anushka
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2025 | 9:16 PM

Share

సాధారణంగా భారతీయ సినిమాల్లో చాలా మంది నటీనటులు విభిన్నమైన నేపథ్యం ఉన్నవారే. చిన్న వయసులోనే పనిచేయడం స్టార్ట్ చేసి ఆ తర్వాత అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టినవారు ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి ఒక యోగా టీచర్. ఆమె గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అనుహ్యంగా సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. సౌత్ సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ అనుష్క శెట్టి. నవంబర్ 7న జన్మించిన ఈ అమ్మడు.. నిరాడంబరమైన జీవితాన్ని ప్రారంభించింది. సినిమాల్లోకి రాకముందు ఆమె యోగా టీచర్‌గా పనిచేసింది. అలాగే ఎంతో మందికి యోగా నేర్పించింది.

అయితే ఓ యోగా కార్యక్రమంలో అనుష్క యోగా నేర్పిస్తుండగా.. దర్శకుడు మెహర్ రమేష్ ఆమెను చూశారు. ఆ తర్వాత ఆమెను డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు పరిచయం చేయడంతో.. సూపర్ సినిమాలో అనుష్కను ఎంపిక చేశారు. దీంతో 2005లో నాగార్జున జోడిగా సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో విక్రమార్కుడు, అరుంధతి, మిర్చి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క కలిసి నటించిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయ్యింది. ఇందులో దేవసేన పాత్రలో అద్భుతమైన పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క.. తమిళ చిత్రపరిశ్రమలోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ బాహుబలి సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత నటించిన చిత్రాలు సైతం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది అనుష్క. ప్రస్తుతం ఘాటీ మూవీలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..