Tollywood: ఎకానామిక్స్‌లో గోల్డ్ మెడల్.. దర్శకుడిని ప్రేమించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇప్పుడు..
చిన్నప్పటి నుంచి టీచర్ కావాలని ఎన్నో కలలు కన్నది. అందుకే చదువులో ముందుండేది. ఆర్థిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. కానీ అనుకోకుండా నటనపై ఆసక్తి కలగడంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో ఆధిపత్యం చేసింది. దర్శకుడిని ప్రేమించి కెరీర్ పూర్తిగా నాశనం చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోహీరోయిన్స్ త్రోబ్యాక్ ఫోటోస్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు నెట్టింట ఓ సీనియర్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన కనిపిస్తున్న ఆ అమాయకపు చూపుల చిన్నారి పాన్ ఇండియాను ఏలేసిన వయ్యారి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. ఆ తర్వాత అన్ని భాషలలో ఆఫర్స్ అందుకుంది. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె జీవితం మలుపు తిరిగింది. దీంతో చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయిన ఆమె.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో రాణిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మరోసారి వెండితెరపై మాయ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? 50 ఏళ్ల వయసులోనూ పెళ్లికి దూరంగా ఒంటరిగా జీవిస్తుంది. ఇద్దరిని ప్రేమించి విడిపోయింది. ఈ రెండు ఘటనపై ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఆమె మరెవరో కాదు.. అమీషా పటేల్.
అమీషా పటేల్.. తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. మహేష్ బాబు నటించిన నాని సినిమా హీరోయిన్. నటనలోనే కాదు.. చదువులోనూ అమీషా పటేల్ సూపర్ టాలెంటెడ్. ఆమె ఆర్థిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించింది. ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత అమెరికాలోని బోస్టన్‌లోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో చేరి 2 సంవత్సరాలు బయో-జెనెటిక్స్ చదివిన తర్వాత ఆర్థిక శాస్త్రంలోకి మారింది. ఎకానామిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. అమీషా పటేల్ 2000 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హృతిక్ రోషన్ నటించిన కహో నా ప్యార్ హై సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె పేరు మారుమోగింది.
2001లో సన్నీ డియోల్ నటించిన గదర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత డైరెక్టర్ విక్రమ్ భట్ తో ప్రేమలో పడింది. అప్పటికే అతడికి పెళ్లి కావడం.. వీరిద్దరి బంధం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఆమె కుటుంబానికి దూరమయ్యింది. అంతేకాకుండా కెరీర్ సైతం దెబ్బతిన్నది. తన జీవితంలో విక్రమ్ భట్ తో ప్రేమ అతి పెద్ద తప్పు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వీరిద్దరు దాదాపు 5 సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. ఇక వీరు విడిపోయిన తర్వాత అమీషా పేరు లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కనవ్ పూరితో వినిపించింది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 2023లో గదర్ 2 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..








