MaheshBabu : మహేష్ బాబు తుపాకీ సినిమా మిస్ చేసుకోవడానికి కారణం ఆయనేనట..!
పాన్ ఇండియా సినిమా చేయకోపోయినా దేశవ్యాప్తంగా మహేష్ బాబు కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగే,.. ఇప్పటికే మహేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే మహేష్ బాబు ఓ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడు. ఆ సినిమా మహేష్ బాబు చేసుంటే ఆయన్న ఖాతలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడుండేది. తెలుగుతో పాటు తమిళ్ లో మహేష్ క్రేజ్ డబుల్ అయ్యుండేది.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. పాన్ ఇండియా సినిమా చేయకోపోయినా దేశవ్యాప్తంగా మహేష్ బాబు కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగే,.. ఇప్పటికే మహేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే మహేష్ బాబు ఓ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడు. ఆ సినిమా మహేష్ బాబు చేసుంటే ఆయన్న ఖాతలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడుండేది. తెలుగుతో పాటు తమిళ్ లో మహేష్ క్రేజ్ డబుల్ అయ్యుండేది. ఇంతకు మహేష్ బాబు మిస్ చేసుకున్న ఆ సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?
మహేష్ బాబుతో సినిమా చేయాలనీ చాలా మంది దర్శకులు ఎదురుచూస్తు ఉంటారు. ఇప్పటికే చాలా మంది దర్శకులను లైన్ లో పెట్టాడు మహేష్. ఈ క్రమంలోనే తమిళ్ దర్శకుడు మురగదాస్ కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలనీ ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో స్పైడర్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. తెలుగు తమిళ్ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
అయితే అంతకన్నాముందు మురగదాస్ తుపాకీ సినిమాను మహేష్ బాబు కోసం రాసుకున్నారట. మహేష్ ను దృష్టిలో ఉంచుకొని తుపాకీ కథను రాసుకున్నారట మురగదాస్. అయితే అదే సమయంలో దళపతి విజయ్ తండ్రి SA చంద్రశేఖర్ చొరవతో ఆ సినిమా విజయ్ కు వెళ్లిందట. తుపాకీ కథను విజయ్ తో చేయాలనీ SA చంద్రశేఖర్ కోరడంతో మురగదాస్ ఆ సినిమాను విజయ్ తో చేశారట. అలా మహేష్ బాబుకు తుపాకీ సినిమా మిస్ అయ్యిందని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు మహేష్ బాబు.
Suit check! pic.twitter.com/1ivF2L5Cet
— Mahesh Babu (@urstrulyMahesh) October 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




