Samantha: జూబ్లీహిల్స్‏లోని సమంత ఇంటి ఫోటోస్ వైరల్.. ఖరీదు ఎంతో తెలిస్తే షాకే..

ప్రస్తుతం సామ్ ఈ వ్యాధికి ఇమ్యూనిటి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కొద్దిరోజుల క్రితం బాలిలో చికిత్స తీసుకున్న సామ్.. ఇటీవలే భూటాన్‏లో ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు ట్రీట్మేంట్ తీసుకుంది. ఇక సోమవారం సామ్ హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. సినిమాలకు బ్రేక్ తీసుకున్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. లేటేస్ట్ ఫోటోషూట్స్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక చాలాసార్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి సంబంధించిన ఫోటోస్ సైతం షేర్ చేసింది.

Samantha: జూబ్లీహిల్స్‏లోని సమంత ఇంటి ఫోటోస్ వైరల్.. ఖరీదు ఎంతో తెలిస్తే షాకే..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 05, 2023 | 12:04 PM

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రలోనే అగ్ర కథానాయిక. ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్‏లో ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారు. విభిన్న కథాంశాలను ఎంచుకోవడం.. నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అయితే సినిమాల పరంగా కెరీర్ సక్సెస్ ఫాంలో ఉండగా.. ప్రేమ, పెళ్లి మాత్రం మధ్యలోనే విచ్చిన్నమయ్యాయి. విడాకుల ప్రకటన అనంతరం నిత్యం సమంత పేరు వార్తలలో నిలుస్తుంది. డివోర్స్ విషయాన్ని ప్రకటించి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ సామ్ పేరు మాత్రం నెట్టింట మారుమోగుతుంది. కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్య.. మానసిక సంఘర్షణతో ఇబ్బందిపడుతుంది. కొన్నాళ్లు ఇంట్లోనే మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకున్న సామ్.. ఆ తర్వాత కాస్త కోలుకోగానే శాకుంతలం, ఖుషి, సిటాడెల్ చిత్రాలను పూర్తి చేసింది. కానీ ఈ మూవీస్ షూటింగ్స్ సమయంలో మరోసారి మయోసైటిస్ వేధించడంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది.

ప్రస్తుతం సామ్ ఈ వ్యాధికి ఇమ్యూనిటి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కొద్దిరోజుల క్రితం బాలిలో చికిత్స తీసుకున్న సామ్.. ఇటీవలే భూటాన్‏లో ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు ట్రీట్మేంట్ తీసుకుంది. ఇక సోమవారం సామ్ హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. సినిమాలకు బ్రేక్ తీసుకున్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. లేటేస్ట్ ఫోటోషూట్స్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక చాలాసార్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి సంబంధించిన ఫోటోస్ సైతం షేర్ చేసింది. ప్రస్తుతం సామ్ ఇంటికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఆకర్షణీయమైన వ్యూస్, ఖరీదైన సోఫాలు, ఇండోల్ ప్లాంట్స్, పెయింటింగ్స్‏తో సమంత ఇల్లు ఎంతో క్లాసీగా కనిపిస్తుంది.

Samantha Home

Samantha Home

జూబ్లీహిల్స్ లోని సమంత విలాసవంతమైన ఇంటి విలువ దాదాపు రూ.100 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో చక్కగా అలంకరించబడిన ఇంటీరియర్ డిజైన్‏ మనసుకు ఎంతో ప్రశాంతను కలిగిస్తుంది. సామ్ ఇంటికి ఎక్కువగా తెలుపు, బూడిద రంగు ఉపయోగించడంతో ప్రశాంతంగా.. ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సామ్.. ఇప్పుడు సిటాడెల్ సిరీస్‏తో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించగా.. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్స్ సిటాడెల్ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.