బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..? అతను చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్‌లో ఉండేది..

మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే డైలాగ్స్ పూరి సినిమాల్లో ఉంటాయి. ఓ పక్క మాస్ కుర్రాడు ఎలా ఉంటాడో  తన సినిమాలో హీరోలను అలానే చూపిస్తాడు పూరి. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఓ బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రేక్షకులను అలరించారు ఈ డాషింగ్ డైరెక్టర్.. ఆ సినిమానే ఇస్మార్ట్ శంకర్. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రామ్ తన కెరీర్ లో బిగెస్ట్ హిట్ అందుకున్నాడు.

బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..? అతను చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్‌లో ఉండేది..
Ismart Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 21, 2024 | 11:03 AM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీ ఉంటుంది. యూత్ ను ఆకట్టుకునే సినిమాలు చేయడంలో పూరి దిట్ట. మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే డైలాగ్స్ పూరి సినిమాల్లో ఉంటాయి. ఓ పక్క మాస్ కుర్రాడు ఎలా ఉంటాడో  తన సినిమాలో హీరోలను అలానే చూపిస్తాడు పూరి. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఓ బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రేక్షకులను అలరించారు ఈ డాషింగ్ డైరెక్టర్.. ఆ సినిమానే ఇస్మార్ట్ శంకర్. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రామ్ తన కెరీర్ లో బిగెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రామ్ తెలంగాణ కుర్రాడిగా కనిపించి మెప్పించాడు రామ్.

ఇది కూడా చదవండి :Naresh: పవిత్ర ఆ విషయం చెప్పగానే సంతోషంతో పొంగిపొయాను.. గర్వంగా ఉందంటున్న నరేష్

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు పూరీ. ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా కథాను ముందుగా మరో హీరోను అనుకున్నారట పూరి ఆ హీరో రిజక్ట్ చేయడంతో రామ్ కు ఆ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఆ హీరో ఎవరంటే.. అతనే రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

ఇది కూడా చదవండి : Venu Swamy: మరో బాంబ్ పేల్చిన వేణుస్వామి..! ఆ టాలీవుడ్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకుంటుందంటూ..

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగిన విజయ్ కు పూరిజగన్నాథ్ ముందుగా ఈ కథను నరేట్ చేశాడట. అయితే ఈ సినిమా కథ విజయ్ కు పెద్దగా నచ్చక పోవడంతో రిజెక్ట్ చేశాడట. అలా విజయ్ దేవరకొండ నుంచి రామ్ పోతినేని ఈ సినిమా ఆఫర్ వచ్చిందట. రామ్ కూడా ఫ్లాప్స్ లో ఉండటంతో ఈ సినిమా కథను దర్శకుడిని నమ్మి ఈ సినిమాను ఓకే చేశాడట. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రామ్ , పూరి తిరిగి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు. కాగా విజయ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత లైగర్ అనే సినిమా చేశాడు పూరిజగన్నాథ్ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.