AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naresh: పవిత్ర ఆ విషయం చెప్పగానే సంతోషంతో పొంగిపొయాను.. గర్వంగా ఉందంటున్న నరేష్

ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయి నటిస్తారు నరేష్. నటుడిగా ఎన్నో శిఖరాలను అధిరోహించిన నరేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సెన్సేషనల్ గా మారింది. నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. రెండో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్ర లోకేష్ తో ఆయన రిలేషన్ లో ఉండటంతో.. రమ్య రఘుపతి పెద్ద గొడవ చేసింది.

Naresh: పవిత్ర ఆ విషయం చెప్పగానే సంతోషంతో పొంగిపొయాను.. గర్వంగా ఉందంటున్న నరేష్
Naresh Pavitra
Rajeev Rayala
|

Updated on: Jul 21, 2024 | 9:05 AM

Share

పవిత్రా లోకేష్, నరేష్ ఈ ఇద్దరి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరూ చాలా ఫెమస్. నటుడిగా నరేష్ ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయి నటిస్తారు నరేష్. నటుడిగా ఎన్నో శిఖరాలను అధిరోహించిన నరేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సెన్సేషనల్ గా మారింది. నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. రెండో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్ర లోకేష్ తో ఆయన రిలేషన్ లో ఉండటంతో.. రమ్య రఘుపతి పెద్ద గొడవ చేసింది. ప్రస్తుతం రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించడంతో కేసు నడుస్తుంది.

ఇది కూడా చదవండి : Venu Swamy: మరో బాంబ్ పేల్చిన వేణుస్వామి..! ఆ టాలీవుడ్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకుంటుందంటూ..

ఇదిలా ఉంటే నరేష్ పవిత్ర గత కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఇటీవలే మళ్లీ పెళ్లి అనే సినిమాలో ప్రధాన పాత్రల్లో చేశారు. నరేష్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ సినిమాలో చూపించారు. ఇదిలా ఉంటే గతంలో గతంలో నరేష్ పవిత్రలోకేష్ గురించి మాట్లాడుతూ.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె ఎంతో టాలెంటడ్ అని కొనియాడారు.

ఇది కూడా చదవండి : వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా..! ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

పవిత్రకు చదువు అంటే చాలా ఇష్టం.. ఆమె ఫ్యామిలీకి మంచి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ ఉందని, ఇంగ్లిష్ తోపాటు కన్నడంలో కూడా మాస్టర్స్ డిగ్రీని పవిత్ర చేసిందని తెలిపారు నరేష్. పవిత్ర పుస్తకాలు బాగా చదువుతారు. ఆమెకు గౌరవ డాక్టరేట్ కూడా ఉంది. ఆమెను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఆమె ఎక్కువగా చదువుతుంది. ఓసారి నేను ఆమెతో కలిసి హంపీ యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ మహిళలపై, రంగస్థలంపై పీహెచ్ డీ చేస్తున్నాను అని ఆమె చెప్పినప్పుడు ఎంతగానో సంతోష పడ్డాను అని అన్నారు. అలాగే ఆమె ఓ ఓ దేవాలయంపై డాక్యుమెంటరీ తీసిందని చెప్పారు నరేష్. ఇక ఇప్పుడు తమ లైఫ్ చాలా సంతోషంగా ఉందని. త్వరలోనే మేమిద్దరం వరల్డ్ టూర్ కు వెళ్తున్నాం అని చెప్పుకొచ్చారు నరేష్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!