Gargi Movie: సాయి పల్లవి ‘గార్గి’ చిత్రానికి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా ?.. ఇంతకీ ఆ పేరుకు అర్థమేంటంటే..
చివరిసారిగా విరాట పర్వం చిత్రంలో నటించింది సాయి పల్లవి. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.. కానీ మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక తమిళంలో హీరో సూర్య అండ్ జ్యోతిక నిర్మించిన గార్గి చిత్రంలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేశారు మేకర్స్. గార్గి మూవీ తర్వాత సాయి పల్లవి నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాయి పల్లవి. తొలి సినిమాతోనే ఆడియన్స్ హృదాయలను కొల్లగొట్టేసింది. అందంలోనే కాదు.. తన మాట తీరు.. డాన్స్.. ఒక్కటేమిటీ మొత్తానికి హైబ్రిడ్ పిల్లా అనిపించుకుంది. కేవలం నటనలోనే కాదు.. సినిమాల ఎంపికలోనూ సాయి పల్లవి డిఫరెంట్ స్టైల్. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా రిజెక్ట్ చేసేస్తుంది. ఇప్పటివరకు ఆమె చేసినవి తక్కువ సినిమాలే అయినా.. భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగు ప్రజలు సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారంటే ఆమె ఫాలోయింగ్ ఏరెంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చివరిసారిగా విరాట పర్వం చిత్రంలో నటించింది సాయి పల్లవి. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.. కానీ మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక తమిళంలో హీరో సూర్య అండ్ జ్యోతిక నిర్మించిన గార్గి చిత్రంలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేశారు మేకర్స్. గార్గి మూవీ తర్వాత సాయి పల్లవి నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు.
చాలా రోజులుగా అటు ఇండస్ట్రీలో.. ఇటు సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యింది సాయి పల్లవి. ఇటీవలే కొద్ది రోజుల క్రితం తన చెల్లెలు పూజా కన్నన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విషెస్ తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది. అయితే తాజాగా ఆమె నటించిన గార్గి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ భాషల్లో విడుదలైన ఈ మూవీకి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో రానా దగ్గుబాటి సమర్పించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే గార్గి అంటే ఎవరు ?.. ఈ సినిమాకు ఆ పేరుకు అర్థమేంటీ ? అనే సందేహాలు చాలా మందిలో తలెత్తాయి. అసలు ఈ గార్గి అంటే ఏంటో తెలుసుకుందామా.
మనకు పురాణాల్లో మహర్షి వంసీయుల్లో వాచక్ను అనే మహర్షి కుమార్తె పేరు గార్గి. ఆమెకు గార్గి వాచక్నవి అని పిలుస్తారు. మహిళలకు పురాణ పఠనం, వేద పఠనం నిషిద్ధమైన రోజుల్లో ఆమె అన్ని వేదాలను, ఉపనిషత్తులను అవపోశన పట్టేది. అప్పట్లో ఈమెను వేద సాహిత్యంలో గొప్ప సహజ తత్వవేత్తగా గౌరవిస్తారు. బ్రహ్మ విద్యా జ్ఞానం ఉన్న వ్యక్తి విదేహా రాజు జనకుడు నిర్వహించిన బ్రహ్మయజ్ఞంలో ఆమె ఆత్మ సమస్యపై గందరగోళ ప్రశ్నలతో యాజ్ఞవల్క్య ఋషిని సవాలు చేసింది. అలాగే ఋగ్వేదంలో అనేక శ్లోకాలను ఆమె రాసిందని అంటారు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయింది. తత్వశాస్త్ర రంగాల్లో చాలా ప్రావీణ్యం సంపాదించింది. ఇక గార్గి చిత్రంలో కథానాయికది అలాంటి పాత్రే. జీవిత సారాన్ని అర్థం చేసుకుంటూ నిరంతరం తనని తాను మధించుకుంటూ నిజంవైపు ప్రయాణిస్తూ.. ఓడిపొతూ.. గెలుస్తూత.. న్యాయం వైపు నిలబడే పాత్ర. ఈ చిత్రంలో సాయి పల్లవి జీవించేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.