AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oy Movie: ‘ఓయ్’ మూవీ టైటిల్‌లో ఇంత అర్థం దాగుందా ?.. డైరెక్టర్‎కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

సిద్ధార్థ్ కెరీర్‏లో 'ఓయ్' సినిమా ఒకటి. ఇందులో బేబీ షాలిని కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది బేబీ షాలిని. సిద్ధార్థ్, బేబీ షాలిని కాంబోలో వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని డైరెక్టర్ ఆనంద్ రంగా తెరకెక్కించారు. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో అడియన్స్‏కు ఎందుకో కనెక్ట్ కాలేకపోయింది. కంటెంట్.. మ్యూజిక్.. యాక్టింగ్ ఇలా అన్నింటిలోనూ ప్రేక్షకులకు అందరికీ తెగ నచ్చేసిన ఈ మూవీ.. అప్పట్లో మాత్రం థియేటర్లలో సక్సెస్ కాలేకపోయింది.

Oy Movie: 'ఓయ్' మూవీ టైటిల్‌లో ఇంత అర్థం దాగుందా ?.. డైరెక్టర్‎కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Oy Movie
Rajitha Chanti
| Edited By: |

Updated on: Feb 13, 2024 | 2:55 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరో సిద్ధార్థ్. బొమ్మరిల్లు, బాయ్స్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆతర్వాత అతడు నటించిన చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ కావడంతో సిద్ధార్థ్ కు తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉండిపోయాడు. సిద్ధార్థ్ కెరీర్‏లో ‘ఓయ్’ సినిమా ఒకటి. ఇందులో బేబీ షాలిని కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది బేబీ షాలిని. సిద్ధార్థ్, బేబీ షాలిని కాంబోలో వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని డైరెక్టర్ ఆనంద్ రంగా తెరకెక్కించారు. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో అడియన్స్‏కు ఎందుకో కనెక్ట్ కాలేకపోయింది.

కంటెంట్.. మ్యూజిక్.. యాక్టింగ్ ఇలా అన్నింటిలోనూ ప్రేక్షకులకు అందరికీ తెగ నచ్చేసిన ఈ మూవీ.. అప్పట్లో మాత్రం థియేటర్లలో సక్సెస్ కాలేకపోయింది. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ శ్రోతలను కట్టిపడేస్తాయి. ఇక ఇప్పుడు ఈ బ్యూటీఫుల్ లవ్ స్టోరీని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మళ్లీ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసేందుకు యూత్ వెయిట్ చేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే అసలు మీకు ‘ఓయ్’ సినిమా టైటిల్ అర్థమేంటో తెలుసా ?.. ఇంతకీ ఈ ప్రేమకథకు డైరెక్టర్ ఓయ్ అని టైటిల్ ఎందుకు పెట్టారో అసలు విషయం చెప్పుకొచ్చారు. ఈ సినిమాను ఎంతో ఇష్టపడి చేశానని.. కానీ ప్రేక్షకులకు ఎందుకు కనెక్ట్ కాలేదు అనేది తనకు అర్థం కాలేదని.. డైరెక్టర్ మణిరత్నం సినిమాల నుంచి స్పూర్తి పొంది ఈ మూవీ కథ రాసుకున్నానని.. అందులో హీరోయిన్స్ హీరోలను ఓయ్ అని పిలుస్తుంటారని.. నిజానికి ఈ మూవీకి ముందు పరుగు అనే టైటిల్ పెట్టాలనుకున్నట్లు తెలిపారు. కానీ స్ట్రీప్ట్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత హీరోయిన్ సంధ్య, హీరో ఉదయ్ ను ఓయ్ అని పిలుస్తుంటుంది. ఇది అందరికి అర్థమయ్యే కామన్ నేమ్.. వినడానికి సౌండ్ కూడా బాగుందని అన్నారు.

సంధ్యతో ఉదయ్ ప్రేమకథ 2007 జనవరి 1న అతడి పుట్టినరోజు నాడు స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ కు సంధ్యను ఉదయ్ షిప్ లోకి తీసుకెళ్లడం వరకు కొనసాగి డిసెంబర్ 31తో ముగుస్తుంది. 2008 జనవరి 1న సంధ్య చనిపోతుంది. దీంతో అతడు బర్త్ డే సెలబ్రేట్ చేసుకోడు. అలా ఉదయ్ ఫస్ట్ లవ్ వన్ ఇయర్ జర్నీ ఉంటుంది. OY అంటే One Year అని మీనింగ్.. అందుకే టైటిల్ అలా పెట్టానని తెలిపారు డైరెక్టర్ ఆనంద్ రంగా. ఓయ్ అనే రెండక్షరాల టైటిల్లో ఇంత అర్థం దాగుందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.