Tollywood: ఇండియాలోనే ఎక్కువ ట్యాక్స్ కడుతున్న హీరో.. ఏడాదికి రూ.92 కోట్లు చెల్లిస్తున్నాడట.. ఎవరంటే..
ఇటీవల హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం పలువురు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ఆస్తుల వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే పలువురు హీరోల ఆస్తులు ఈ సంవత్సరం మరింత రెట్టింపు అయ్యాయి. ఈ ఏడాది హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం సెలబ్రెటీలలో అగ్రస్థానంలో నిలిచాడు
ఇటీవల హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం పలువురు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ఆస్తుల వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే పలువురు హీరోల ఆస్తులు ఈ సంవత్సరం మరింత రెట్టింపు అయ్యాయి. ఈ ఏడాది హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం సెలబ్రెటీలలో అగ్రస్థానంలో నిలిచాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. అవును.. ఇప్పుడు దేశంలోని అత్యంత సంపన్నులలో షారుఖ్ ఒకరు. ప్రస్తుతం అతడి సంపద రూ.7300 కోట్లు ఉంటుందట. ఇప్పుడు ఈ హీరో 2024లో భారతదేశంలో అత్యధిక సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుడిగా నిలిచారు. 2023-24 ఏడాదికి గానూ ఈ హీరో ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్ చెల్లించాడట. అలాగే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ.66 కోట్లను ట్యాక్స్ గా చెల్లించినట్లు ఫార్చూన్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం.. ఈ ఏడాది రూ.92 కోట్లు పన్ను చెల్లించాడట. ఆ తర్వాత అతడి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నిలిచాడు. 2023-24 ఏడాదికి విజయ్ రూ.80 కోట్లు పన్నులు పే చేశాడు. ఈ ఏడాది లిస్ట్‌లో అక్షయ్ కుమార్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2022లో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా రూ. 29.5 కోట్ల పన్నులు, ఆదాయపు పన్ను శాఖ నుండి గౌరవ ధృవీకరణ పత్రాన్ని కూడా అందుకున్నాడు. ఇక ఈ ఏడాది మాత్రం అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ అయ్యాయి. అదే సమయంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్, డంకీ చిత్రాలు హిట్టయ్యాయి.
2024లో అత్యధికంగా పన్నులు చెల్లించిన టాప్ ఇండియన్ సెలబ్రెటీలు.. 1. షారుఖ్ ఖాన్ – రూ. 92 కోట్లు
2. దళపతి విజయ్ – రూ. 80 కోట్లు
3. సల్మాన్ ఖాన్ – రూ. 75 కోట్లు
4. అమితాబ్ బచ్చన్ – రూ. 71 కోట్లు
5. విరాట్ కోహ్లీ – రూ. 66 కోట్లు
6. అజయ్ దేవగన్ – రూ. 42 కోట్లు
7. MS ధోని – రూ. 38 కోట్లు
8. రణబీర్ కపూర్ – రూ. 36 కోట్లు
9. సచిన్ టెండూల్కర్ – రూ. 28 కోట్లు
10. హృతిక్ రోషన్ – రూ. 28 కోట్లు
11. కపిల్ శర్మ – రూ. 26 కోట్లు
12. సౌరవ్ గంగూలీ – రూ. 23 కోట్లు
13. కరీనా కపూర్ – రూ. 20 కోట్లు
14. షాహిద్ కపూర్ – రూ. 14 కోట్లు
15. మోహన్ లాల్ – రూ. 14 కోట్లు
16. అల్లు అర్జున్ – రూ. 14 కోట్లు
17. హార్దిక్ పాండ్యా – రూ. 13 కోట్లు
18. కియారా అద్వానీ – రూ. 12 కోట్లు
19. కత్రినా కైఫ్ – రూ. 11 కోట్లు
20. పంకజ్ త్రిపాఠి – రూ. 11 కోట్లు
21. అమీర్ ఖాన్ – రూ. 10 కోట్లు
22. రిషబ్ పంత్ – రూ. 10 కోట్లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.