Aha Na Pellanta Movie: ఆహా నా పెళ్లంట సినిమాలో లక్ష్మీపాత్ర ఆ నటుడు చేయాల్సింది.. కానీ ఎలా మిస్సయ్యిందంటే..
సినిమాల్లోని కొన్ని పాత్రలు చూస్తే అందులో కోట శ్రీనివాసరావు తప్ప మరొకరు ఊహించుకోవడం కష్టమే. అంతగా ఆ పాత్రలలో లీనమైపోతుంటారు. కోట శ్రీనివాస్ రావు పోషించిన వందలాది పాత్రలలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర లక్ష్మీపతి. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కించిన అహ నా పెళ్లంట సినిమాలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో అద్భుతంగా నటించారు కోట శ్రీనివాస్ రావు. నటించడం కంటే జీవించారు అని చెప్పడం సరైనది.

కోట శ్రీనివాస్ రావు.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయంలేదు. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. ఎలాంటి పాత్రలలోనైన ఇమిడిపోగల అతికొద్ది మంది నటులలో ఆయన ఒకరు. తండ్రిగా, తాతయ్యగా, అవినీతి నాయకుడిగా, భయపెట్టే విలన్గా, కడుపుబ్బా నవ్వించే కమెడియన్గా ఇలా ఒక్కటేమిటీ ఎన్నో పాత్రలకు తన నటనతో ప్రాణం పోశారు. సినిమాల్లోని కొన్ని పాత్రలు చూస్తే అందులో కోట శ్రీనివాసరావు తప్ప మరొకరు ఊహించుకోవడం కష్టమే. అంతగా ఆ పాత్రలలో లీనమైపోతుంటారు. కోట శ్రీనివాస్ రావు పోషించిన వందలాది పాత్రలలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర లక్ష్మీపతి. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కించిన అహ నా పెళ్లంట సినిమాలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో అద్భుతంగా నటించారు కోట శ్రీనివాస్ రావు. నటించడం కంటే జీవించారు అని చెప్పడం సరైనది.
ఈ సినిమాలో పిసినారి లక్ష్మీపతి, అరగుండు పాత్రలో కనిపించిన బ్రహ్మానందం నటన గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు కలిసి పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే ముందుగా లక్ష్మీపతి పాత్ర కోసం కోట శ్రీనివాస్ రావును అనుకోలేదట. నిజానికి ఈ పాత్ర కోసం రావు గోపాలరావును అనుకున్నారట. అయితే అప్పటికే కోట శ్రీనివాస్ రావు నటించిన మండలాధీశుడు సినిమా విడుదల కావడంతో జంధ్యాల.. కోట శ్రీనివాస్ రావుతో ఆ పాత్రను చేయించాలని అనుకున్నారట. ఇందుకు నిర్మాత డి.రామానాయుడు ముందు ఒప్పుకోలేదట. కానీ జంధ్యాల పట్టుబట్టి ఒప్పించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
చెన్నై వెళ్లడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లిన తనకు అక్కడే రామానాయుడు కనిపించారని.. అక్కడే విషయాన్ని చెప్పారని అన్నారు. తాను జంధ్యాలతో ఓ సినిమా ప్లాన్ చేశానని.. ఫైనలైజ్ కూడా అయ్యిందని.. కానీ ఆ సినిమాలో ఓ క్యారెక్టర్ ఉందని.. అది పండితే సినిమా చాలా బాగా ఆడుతుందని అన్నారు. ఆ పాత్ర గురించి తనకు, జంధ్యాలకు 20 రోజులుగా చర్చ జరుగుతుందని.. రావుగోపాలరావుతో వేయిద్దామని నేను, కాదు కోట శ్రీనివాస్ రావుతో వేయిద్ధామని జంధ్యాల పట్టుబట్టారని.. చివరకు కోట శ్రీనివాసరావుతోనే ఈ పాత్ర వేయించాలని ఒప్పుకున్నానని.. అందుకు తన 20 రోజులపాటు డేట్స్ కావాలని అడిగారని.. ఆ సినిమా తనకు మంచి పేరు తీసుకువచ్చిందని చెప్పుకొచ్చారు కోట శ్రీనివాస్ రావు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
