Chinnadana Neekosam: అయ్యా బాబోయ్.. ఈ అమ్మాయి నితిన్ హీరోయినా..? మరీ ఇంతందంగా తయారయ్యిందేంటీ..

ఒక్క సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో మిస్త్రీ చక్రవర్తి ఒకరు. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు. కానీ నితిన్ నటించిన చిన్నదాన నీకోసం సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ఈ మూవీతోనే పాపులర్ అయ్యింది ఈ బెంగాలీ బ్యూటీ.

Chinnadana Neekosam: అయ్యా బాబోయ్.. ఈ అమ్మాయి నితిన్ హీరోయినా..? మరీ ఇంతందంగా తయారయ్యిందేంటీ..
Mishti Chakraborty
Follow us

|

Updated on: Jun 23, 2024 | 7:22 AM

సాధారణంగా సినీ పరిశ్రమలోకి చాలా మంది హీరోయిన్స్ అడుగుపెడుతుంటారు. అందులో కొందరు ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటారు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం ఇండస్ట్రీలో క్లిక్ అయినా ఉన్నట్లుండి సినిమాలకు దూరమైపోతారు. ఫస్ట్ మూవీతో అందం, అభినయంతో మెప్పించి ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంటారు. ఆ తర్వాత మరో సినిమా చేయకుండానే కనుమరుగవుతారు. ఒక్క సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో మిస్త్రీ చక్రవర్తి ఒకరు. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు. కానీ నితిన్ నటించిన చిన్నదాన నీకోసం సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ఈ మూవీతోనే పాపులర్ అయ్యింది ఈ బెంగాలీ బ్యూటీ.

2013లో పొరిచేయ్ అనే సినిమాతో బెంగాలీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతో అక్కడ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత నితిన్ నటించిన చిన్నదాన నీకోసం మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. కానీ అందం, అభినయంతో ఈ బ్యూటీకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. అమాయకపు చూపులు.. తనదైన నటనతో అందర్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా అప్పట్లో యూత్ మొత్తన్ని తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, నటనతో ఫిదా చేసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో బిజీ అవుతుందనుకున్నారు అంతా.. కానీ అలాంటిదేమీ లేకుండా కేవలం ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమయ్యింది. తెలుగులో ఒక్క మూవీ చేసిన ఈ బ్యూటీ.. హిందీలో కాంచీ అనే సినిమాలో నటించింది.

తెలుగుతోపాటు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. కానీ ఈ చిత్రాలు మిస్తీకి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. గతేడాది ఓ సాథియా అనే సినిమాలో కనిపించింది. ఈ మూవీ రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. చిన్నదాన నీకోసం సినిమాలో ముద్దుగా ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన ఆ తార.. ఇప్పుడు మాత్రం సన్నజాజి తీగల మారింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చాలా కాలం తర్వాత ఈ భామను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. 36 ఏళ్ల వయసులోనూ అచ్చం పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది మిస్తీ. ప్రస్తుతం నెట్టింట వరుస ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది.

View this post on Instagram

A post shared by MISHHTI (@mishtichakravarty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!