AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: 2009లో విడుదలైన తెలుగు సినిమా.. దెబ్బకు బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్.. ఇప్పటికీ తగ్గని హావా..

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హావా నడుస్తుంది. భారీ బడ్జెట్, స్టార్ హీరోలతో అంచనాల మధ్య రూపొందిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తున్నాయి. ఇటీవల బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాలు కలెక్షన్ల సునామీ క్రియేట్ చేశాయి. కానీ ఈ సినిమాల కంటే ముందే ఒక సినిమా సంచలనం సృష్టించింది. 2009లో విడుదలైన ఈ మూవీ రికార్డ్ ఇప్పటికీ బ్రేక్ చేయలేకపోతున్నారు.

Cinema: 2009లో విడుదలైన తెలుగు సినిమా.. దెబ్బకు బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్.. ఇప్పటికీ తగ్గని హావా..
Magadheera
Rajitha Chanti
|

Updated on: Apr 09, 2026 | 8:53 AM

Share

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ప్రతి సినిమా వందల కోట్లు వసూలు చేయడం సర్వసాధారణం అయిపోయింది కానీ, దాదాపు 18 ఏళ్ల క్రితమే తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ఘనత ఉన్న చిత్రం గురించి మీకు తెలుసా.. ? అవును ‘బాహుబలి’ కంటే ముందే బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి తెలుగు చిత్రంగా రామ్ చరణ్ నటించిన మగధీర రికార్డు సృష్టించింది. ఆ సమయంలో తెలుగు సినిమా మార్కెట్ పరిధిని అమాంతం పెంచేసిన చిత్రమిది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘మగధీర’ చిత్రం టాలీవుడ్ చరిత్రలో ఒక అద్భుతం. నేడు మనం చూస్తున్న ‘బాహుబలి’, ‘RRR’ వంటి భారీ చిత్రాలకు అసలైన పునాది ‘మగధీర’ సినిమానే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 2009లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమను సైతం ఆశ్చర్యపరిచింది.

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ చారిత్రక ప్రేమకథ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 400 ఏళ్ల క్రితం నాటి ‘ఉదయ్‌ఘర్’ సామ్రాజ్యం, అందులో కాలభైరవగా రామ్ చరణ్ వీరోచిత పోరాటాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వంద మంది సైనికులతో ఒంటరిగా పోరాడే ఘట్టం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. రాజమౌళి విజన్, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ చిత్రాన్ని ఒక మాస్టర్ పీస్‌గా మార్చాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

రామ్ చరణ్ తన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. ఆయన నటన, డ్యాన్స్, గుర్రపు స్వారీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా విజయంతోనే చరణ్ ‘మెగా పవర్ స్టార్’గా ఎదిగారు. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. మొత్తానికి, తెలుగు సినిమా కేవలం ఫ్యామిలీ డ్రామాలు లేదా యాక్షన్ సినిమాలకే పరిమితం కాదని, భారీ విజువల్ వండర్స్‌ను కూడా సృష్టించగలదని ‘మగధీర’ నిరూపించింది. నేడు రాజమౌళి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందడానికి, ఆర్.ఆర్.ఆర్ వంటి చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లడానికి మగధీర సృష్టించిన ప్రభామే ప్రధాన కారణం. అందుకే ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి